Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-4

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ‘పూజ’ సినిమాలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ పాటకి రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చిన ఏ కన్నడ సినిమా లోని ఏ పాట మూలం?
  2. రాజన్ నాగేంద్ర స్వరాలందించిన ‘ఇంటింటి రామాయణం’ సినిమాలోని ‘ఇంటింటి రామాయణం, వింతైన ప్రేమాయణం’ పాట రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ కన్నడ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  3. రాజన్ నాగేంద్ర స్వరపరిచిన ‘రాజు రాణి జాకి’ సినిమాలోని ‘ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం’ పాటకి రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఏ కన్నడ సినిమా లోని ఏ పాట మూలం?
  4. రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ‘ఖైదీ కన్నయ్య’ సినిమాలోని ‘ఈ నిజం తెలుసుకో తెలివిగా నడుచుకో’ పాట శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  5. రాజన్ నాగేంద్ర స్వరపరిచిన ‘ఇంటింటి రామాయణం’ సినిమాలోని ‘మల్లెలు పూచె వెన్నెల కాచే ఈ రేయి హాయిగా’ పాట రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ కన్నడ సినిమా లోని ఏ పాట మూలం?
  6. జి.కె. వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించిన ‘జమీందారు గారి అమ్మాయి’ సినిమాలోని ‘మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన’ పాట జి.కె. వెంకటేష్ స్వరాలు కూర్చిన ఏ కన్నడ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఫిబ్రవరి 22వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-2 జవాబులు:

  1. చైనా టౌన్, బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో
  2. జాల్‌సాజ్, ప్యార్ కా జహాఁ హో
  3. పతంగా, ప్యార్ కీ జహాఁ కీ నిరాలీ సర్కార్ హై
  4. ససురాల్, తేరీ ప్యారీ ప్యారీ సూరత్‍కో
  5. అనార్కలి, ఏ జిందగీ ఉసీ కా హై
  6. సి.ఐ.డి., ఏ దిల్ హై ముష్‌కిల్ హై జీనా యహాఁ

~

చెప్పుకోండి చూద్దాం-2కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version