[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘పడిక్కాద మేదై’ అనే తమిళ సినిమాలోని ‘పక్కథిల్ కన్ని పెణ్’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘ఆత్మ బంధువు’ (1962) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- తమిళ చిత్రం ‘పాశమలర్’ లోని ‘మలర్నుథమ్ మలరాద’ పాటకు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు ఘంటసాల, ఎన్.టి.ఆర్. సావిత్రిల ‘రక్తసంబంధం’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
- తమిళ సినిమా ‘తై పిరందాల్ వళి పిరక్కుం’ లోని ‘ఎల్లాట్టు సొల్లాట్టు’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మంచిమనసుకు మంచిరోజులు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఆలయమణి’ అనే తమిళ చిత్రంలోని ‘సత్తి సుత్తదడా’ పాటని విశ్వనాథన్-రామ్ముర్తి స్వరపరిచారు. దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘గుడి గంటలు’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘నానున్ ఒరు పెణ్’ అనే తమిళ సినిమాలోని ఆర్. సుదర్శనం స్వరకల్పన చేసిన ‘కణ్ణా, కరుణ మిరు కణ్ణా’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘నాదీ ఆడజన్మే’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- తమిళ చిత్రం ‘కుళందైవమున్’ లోని ‘అన్బుళ్ల మాంగిళివే’ పాటకు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ‘లేత మనసులు’ (1966) చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 నవంబర్ 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-41 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 08వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-39 జవాబులు:
- వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్
- పాట ఆగింగా, ఒక సీటు గోవిందా
- ఆశలే అలలుగా, ఊగినే సరదాగా
- కలవాణి అలివేణి ఆడే
- నా హృదయపు కోవెలలో
- నీవు నా ఊహలందే నిలిచావు
~
చెప్పుకోండి చూద్దాం-39 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ఆర్. రఘునాథ రావు, ఆదోని
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, అంగలకుదురు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- సాకరే లక్ష్మీబాయి, చెన్నై
- సాకరే ఆదిత్య, చెన్నై
- సాకరే అభిషేక్, చెన్నై
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
