Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-44

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తి పొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. హిందీ చిత్రం ‘ప్రొఫెసర్’ లోని పాట ‘ఏ గుల్‌బదన్ ఏ గుల్‌బదన్’కి శంకర్-జైకిషన్ స్వరాలు అందించారు. తెలుగులో ‘నాదీ ఆడజన్మే’ చిత్రంలో సంగీత దర్శకుడు ఆర్.సుదర్శనం గారు దీన్ని ఏ పాటగా ఉపయోగించారు?
  2. ఇంగ్లీషు గాయకులు రికీ మార్టిన్ పాడిన ‘జాలియో’ స్పానింగ్లీష్ పాటను తెలుగులో మణిశర్మ, ‘పోకిరి’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
  3. హిందీ సినిమా ‘గిన్నీ వెడ్స్ సన్ని’ లో ‘సావన్‍ మే లగ్ గయీ ఆగ్’ పాటను తెలుగు చిత్రం ‘ఇడియట్’ లో సంగీత దర్శకుడు ‘చక్రి’ ఏ పాటగా వాడుకున్నారు?
  4. హిందీ చిత్రం ‘ప్యార్ ఝక్తా నహీ’ చిత్రానికి సంగీతం అందించినది లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఈ సినిమాలోని ‘తుమ్ సే మిల్‍కర్ నా జానే క్యూఁ’ అనే పాటను తెలుగులో ‘పచ్చని కాపురం’ చిత్రం కోసం సంగీత దర్శకుడు చక్రవర్తి ఏ పాటగా వాడుకున్నారు?
  5. తమిళ చిత్రం ‘పూవే ఉనక్కాగ’ లో ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతంలో వచ్చిన పాట ‘ఆనంతం ఆనంతం పాడు’ ను తెలుగులో ‘శుభాకాంక్షలు’ చిత్రంలో ఏ పాటగా వాడారు?
  6. తమిళ చిత్రం ‘చిన్న గౌండర్’ చిత్రానికి సంగీతం ఇళయరాజా. ఈ సినిమా లోని ‘చిన్న కిళి చిన్న కిళి’ అనే పాటను తెలుగులో ‘చినరాయుడు’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 నవంబర్ 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-44 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 29వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-42 జవాబులు:

  1. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
  2. ఆకాశమేలే అందాల రాజు
  3. హల్లో మేడం సత్యభామ
  4. పిల్లలూ దేవుడూ చల్లనివారే
  5. చల్లని స్వామివి నీవైతే
  6. చేసేది ఏమిటో చేసెయ్యి

~

చెప్పుకోండి చూద్దాం-42 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version