Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-45

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. తమిళ సినిమా ‘ఎంగ చిన్న రాస’ లోని ‘కొండై సేవల్ కూవుమ్’ పాటను శంకర్ గణేష్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అబ్బాయి గారు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘తెనాలి రామన్’ అనే తమిళ సినిమాలోని విశ్వనాథన్-రామ్మూర్తి స్వరకల్పన చేసిన ‘కంగళిల్ ఆడిదం’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘వీరాభిమన్యు’ అనే తమిళ సినిమాలోని కె. వి. మహదేవన్ స్వరకల్పన చేసిన ‘పార్తె సిరుత్తె పక్కత్తిల్’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘వీరాభిమన్యు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. స్వీడన్ దేశపు సంగీత బృందం Rednex పాడిన Cotton Eye Joe అనే పాటను తెలుగులో ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సింహాద్రి’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. హిందీ చిత్రం ‘జంగ్లీ’ లోని ‘అయ్యాయ్యా కరూ క్యా సూకు సూకు’ పాటకు సంగీతం శంకర్-జైకిషన్. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు టి.వి. రాజు, ‘భలే మాస్టారు’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
  6. తమిళ చిత్రం ‘సూర్యవంశం’ లోని ‘ఛలకు ఛలకు’ పాటకు సంగీతం ఎస్. ఎ. రాజ్‍కుమార్. దీనిని తెలుగులో ‘సూర్యవంశం’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 డిసెంబర్ 01వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-45 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 డిసెంబర్ 06వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-43 జవాబులు:

  1. చిన్నారి పొన్నారి పువ్వు
  2. తాకిన చోట ఎంతో చల్లదనం
  3. ఈ దేశం ఆంధ్రుల దేశం రా
  4. శరణు శరణయా జానకిరామ కరుణ జూపవ
  5. తెలుసా నేస్తమా నేస్తమా?
  6. చెప్పవే ప్రేమా

~

చెప్పుకోండి చూద్దాం-43 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version