Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-46

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. తమిళ సినిమా ‘నీ వరు వాయెనా’ లోని ‘ఒరు దేవత వందు వీట్టాల్’ పాటను ఎస్. ఎ. రాజ్‍కుమార్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘నిన్నే ప్రేమిస్తా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘ముంగారు మళె’ అనే కన్నడ సినిమాలోని మనోమూర్తి స్వరకల్పన చేసిన ‘అనిసుతిద యాకూ ఇందు’ పాటను, కమలాకర్ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘వాన’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. మడోన్నా పాడిన Frozen అనే పాటను తెలుగులో చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  4. హిందీ చిత్రం ‘నవరంగ్’ లోని ‘ఆధా హై చంద్రమా రాత్ ఆధీ’ పాటకు సంగీతం సి. రామచంద్ర. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు, ‘పూజాఫలం’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
  5. 1937లో వచ్చిన ‘వహన్’ అనే హిందీ సినిమాలోని శాంతా ఆప్టే పాడిన ‘హర్ గలీ మె హై బగీచే’ పాటను, ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘మిస్సమ్మ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. తమిళ చిత్రం ‘వంద రాజవదన వరువేన్’ లోని ‘మోడర్న్ మునియమ్మ’ పాటకు సంగీతం హిప్ హాప్ తమిళ్. దీనిని తెలుగులో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (నాని) చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 డిసెంబర్ 08వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-46 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 డిసెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-44 జవాబులు:

  1. నా మాట నమ్మితివేలా
  2. దేవ దేవ దేవుడా
  3. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే
  4. వెన్నెలైనా చీకటైనా
  5. ఆనంద మానందమాయె
  6. బుజ్జిపిట్ట బుజ్జిపిట్ట

~

చెప్పుకోండి చూద్దాం-44 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version