Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-5

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ‘సుమంగళి’ సినిమాలోని ‘సిగలోకి విరులిచ్చి, చెలి నొసట’ పాటకి కె. వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఏ తమిళ సినిమా లోని ఏ పాట మూలం?
  2. పెండ్యాల స్వరాలందించిన ‘బందిపోటు దొంగలు’ సినిమాలోని ‘విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా’ పాట ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ తమిళ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  3. వి. కుమార్ స్వరపరిచిన ‘సంబరాల రాంబాబు’ సినిమాలోని ‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’ పాటకి వి. కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఏ తమిళ సినిమా లోని ఏ పాట మూలం?
  4. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించిన ‘సిపాయి చిన్నయ్య’ సినిమాలోని ‘ఆ నావ దాటిపోయింది’ పాట ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ తమిళ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  5. కె. వి. మహదేవన్ స్వరపరిచిన ‘మంచి మనసులు’ సినిమాలోని ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ పాటకి కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ తమిళ్ సినిమా లోని ఏ పాట మూలం?
  6. ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘కానిస్టేబుల్ కూతురు’ సినిమాలోని ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన’ పాట ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరాలు కూర్చిన ఏ తమిళ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 01వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-3 జవాబులు:

  1. పారస్‍మణీ, హస్తా హువా నూరానీ చెహరా
  2. ఏ రాస్తే హై ప్యార్ కే, ఏ ఖామోషియాఁ ఏ తన్హాయియాఁ
  3. సి.ఐ.డి., లేకే పెహలా పెహలా ప్యార్ భర్ కే ఆంఖోం మే
  4. జంగ్లీ, మేరా యార్ షబ్బఖైర్
  5. ఉజాలా, ఝాంతా మౌసం మస్త్ మహీనా
  6. జూలీ, ఏ రాతే నయీ పురానీ

~

చెప్పుకోండి చూద్దాం-3కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version