[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘మూగ నోము’ సినిమాలోని ‘నిజమైనా, కలయైనా నిరాశలో’ పాటకి చిత్రగుప్త స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- మాస్టర్ వేణు స్వరాలందించిన ‘మాంగల్య బలం’ (అక్కినేని) సినిమాలోని ‘పెనుచీకటాయె లోకం’ పాట అనుపమ్ ఘటక్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ బెంగాలీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
- ఘంటసాల స్వరపరిచిన ‘శభాష్ రాజా’ (అక్కినేని) సినిమాలోని ‘లోకానా దొంగలు వేరే లేరయ్యా’ పాటకి రవి సంగీత దర్శకత్వం వహించిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- టి.వి. రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘భలే మాస్టారు’ సినిమాలోని ‘అదుగో చిన్నది’ పాట ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
- కె. వి. మహదేవన్ స్వరపరిచిన ‘అదృష్టవంతులు’ సినిమాలోని ‘నా మనసే గోదావరి’ పాటకి శంకర్ – జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- జి.కె. వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించిన ‘నాటకాల రాయుడు’ సినిమాలోని ‘నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర’ పాట సి. రామచంద్ర స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 08వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-4 జవాబులు:
- ఎరడు కనసు, ఎందెందూ నిన్నన మరతూ బతుకిదలాగే
- గిరికన్య, థై థై నిన్న బంగారి
- పావనగంగ, ఆకాశదీపవు నీవు, నిను కండాది
- ససురాల్, ఏక్ సవాల్ మై కరూఁ, ఏక్ సవాల్ తుమ్ కరో
- మాంగల్యభాగ్య, ఆశయ భావ, బలవన జీవ, బందొగె
- తాయిదేవరు, హోయాగిదే దినమన
~
చెప్పుకోండి చూద్దాం-4కి సరైన సమాధానాలు పంపిన వారు:
ఎవరూ లేరు
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
