Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-7

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

నలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. విజయ భాస్కర సంగీత దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘నాగరహావు’ లోని ‘సంగమ, సంగమ, అనురాగ సంగమ’ పాటకి అనుకరణగా ఉన్నది – పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు కూర్చిన ‘కోడెనాగు’ సినిమా లోని ఏ పాట?
  2. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలందించిన ‘మిలన్ కీ రాత్’ అనే హిందీ సినిమాలోని ‘నీంద్ చురాయేనా చైన్ ఉడా యేనా’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి. రాజు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘గండికోట రహస్యం’ సినిమా లోని ఏ పాట?
  3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలందించిన ‘ఆస్రా’ అనే హిందీ సినిమాలోని ‘మేరీ సూనీ జీవన్‍ కీ ఆస్రా హై తూ’ పాటకి అనుకరణగా ఉన్నది – టి చలపతి రావు సంగీత దర్శకత్వం వహించిన ‘చల్లని నీడ’ సినిమా లోని ఏ పాట?
  4. శంకర్ – జైకిషన్ స్వరాలందించిన ‘బర్సాత్’ అనే హిందీ సినిమాలోని ‘జియా బేకరర్ హై’ పాటకి అనుకరణగా ఉన్నది – సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన ‘సంసారం’ సినిమా లోని ఏ పాట?
  5. సి. రామచంద్ర స్వరాలందించిన ‘ఆజాద్’ (దిలీప్ కుమార్) అనే హిందీ సినిమాలోని ‘దేఖో జీ బహార్ ఆయీ’ పాటకి అనుకరణగా ఉన్నది – అద్దేపల్లి/టి.వి. రాజు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘చింతామణి’ సినిమా లోని ఏ పాట?
  6. చిత్రగుప్త్ స్వరాలందించిన ‘భాభీ’ అనే హిందీ సినిమాలోని ‘చల్ ఉఢ్ జా రే పంఛీ’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు స్వరాలు కూర్చిన ‘కులదైవం’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 10వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 15వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-5 జవాబులు:

  1. శారద, కూందలక్కీ మలర్ కొడుత్తా
  2. నెంజి ఇరుక్కుం వరై, ముత్తు కళ్ళో కన్నం
  3. ఎదిర్ నీచ్చల్, ఉడుతాత్తు అంబుపొత్తేల
  4. రామన్ ఎత్తనే రామనడి, అమ్మాడీ పొన్నుక్కు తంగ మనసు
  5. కుముదం, ఎన్న వీట్టి వోడిపోవు తెరియుమా
  6. పోలీస్ కారన్ మగన్, ఉన్నమండత్రిల్ ఓడివరుని

~

చెప్పుకోండి చూద్దాం-5కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version