Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-8

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

నలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. రవి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘వక్త్’ లోని ‘దిన్ హై బహార్ కీ’ పాటకి అనుకరణగా ఉన్నది – ఘంటసాల స్వరాలు కూర్చిన ‘భలే అబ్బాయిలు’ సినిమా లోని ఏ పాట?
  2. మదన్ మోహన్ స్వరాలందించిన ‘వో కౌన్ థీ’ అనే హిందీ సినిమాలోని ‘నైనా బర్‌సే రిమ్ జిమ్ రిమ్ జిమ్’ పాటకి అనుకరణగా ఉన్నది – వేదా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఆమె ఎవరు’ సినిమా లోని ఏ పాట?
  3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలందించిన ‘హంజోలి’ అనే హిందీ సినిమాలోని ‘హాయ్ రే హాయ్ నీంద్ నహీ ఆయ్’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా లోని ఏ పాట?
  4. శంకర్ – జైకిషన్ స్వరాలందించిన ‘సూరజ్’ అనే హిందీ సినిమాలోని ‘ఇత్‌నా హై తుమ్ సే ప్యార్ మగర్’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి. రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘గండికోట రహస్యం’ సినిమా లోని ఏ పాట?
  5. రవి స్వరాలందించిన ‘వచన్’ (1955) అనే హిందీ సినిమాలోని ‘చందామామా దూర్ సే’ పాటకి అనుకరణగా ఉన్నది – సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఇలవేల్పు’ సినిమా లోని ఏ పాట?
  6. ఆర్.డి. బర్మన్ స్వరాలందించిన ‘కారవాన్’ అనే హిందీ సినిమాలోని ‘దయ్య ఏ మై కహా ఫసీ’ పాటకి అనుకరణగా ఉన్నది – జి.కె. వెంకటేష్ స్వరాలు కూర్చిన ‘శ్రీవారు మావారు’ (కృష్ణ) సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 17వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 22వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-6 జవాబులు:

  1. మై చుప్ రహూంగీ, మై కౌన్ హూఁ మై కహాఁ హూఁ
  2. అగ్నిపరీక్ష, మై తుమోరి అమారి చాకో
  3. చౌద్వీ కా చాంద్, దిల్ కీ కహానీ రంగ్ లాయేగీ
  4. భూత్ బంగ్లా, ఆవో ట్విస్ట్ కరే
  5. సంగమ్, మేరీ మన్‍ కీ గంగా
  6. అల్‌బెలా, ధీరే సే ఆజా అఖియోఁ మే నిందియా

~

చెప్పుకోండి చూద్దాం-6కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version