Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-9

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘డాన్’ (అమితాభ్) లోని ‘ఖైకే పాన్ బనారస్ వాలా’ పాటకి అనుకరణగా ఉన్నది – ఇళయరాజా స్వరాలు కూర్చిన ‘యుగంధర్’ సినిమా లోని ఏ పాట?
  2. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ స్వరాలందించిన ‘ముకద్దర్ కా సికందర్’ అనే హిందీ సినిమాలోని ‘ఓ సాథీ రే తేరా బినా బీ క్యా జీనా’ పాటకి అనుకరణగా ఉన్నది – జె.వి. రాఘవులు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రంగూన్ రౌడీ’ సినిమా లోని ఏ పాట?
  3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలందించిన ‘బాబి’ అనే హిందీ సినిమాలోని ‘హమ్ తుమ్ ఏక్ కమరే బంద్ హో’ పాటకి అనుకరణగా ఉన్నది – జి.కె. వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించిన ‘జమీందారు గారి అమ్మాయి’ సినిమా లోని ఏ పాట?
  4. సి. రామచంద్ర స్వరాలందించిన ‘స్త్రీ’ (వి. శాంతారాం) అనే హిందీ సినిమాలోని ‘ఓ ఓ నిర్దయీ ప్రీతమ్’ పాటకి అనుకరణగా ఉన్నది – రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ‘మదన కామరాజు కథ’ సినిమా లోని ఏ పాట?
  5. శంకర్ – జైకిషన్ స్వరాలందించిన ‘జాన్వర్’ (షమ్మీ కపూర్) అనే హిందీ సినిమాలోని ‘తుమ్ సే అచ్ఛా కౌన్ హై’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి. రాజు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మన సంసారం’ సినిమా లోని ఏ పాట?
  6. హేమంత్ కుమార్ స్వరాలందించిన ‘ఏక్ హీ రాస్తా’ అనే హిందీ సినిమాలోని ‘చలీ గోరీ ప్రీతమ్ సే మిల్నే చలీ’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు స్వరాలు కూర్చిన ‘కుంకుమరేఖ’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 24వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 29వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-7 జవాబులు:

  1. సంగమం, సంగమం, అనురాగ సంగమం
  2. మరదలు పిల్లా ఎగిరిపడకు
  3. మల్లెల కన్నా జాబిలి కన్నా
  4. కల నిజమాయెగా, కోరిక తీరెగా
  5. పున్నమీ చకోరినోయీ
  6. పయనించే ఓ చిలుకా ఎగిరిపో

~

చెప్పుకోండి చూద్దాం-7కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version