పలమనేరు బాలాజీ రచించిన 20 కథల సంపుటి ‘చిగురించే మనుషులు’. ఈ పుస్తకానికి ముందుమాట ‘నిజంగానే నిఖిల లోకం కోసం’లో వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఇంద్రియ నైశిత్యం, చేతనా సౌకుమార్యం కనుమరుగవుతున్న సమాజం గురించి రచయిత పడుతున్న ఆవేదనను అందరితో పంచుకోవటం రాసిన కథలివి అని రాశారు.
‘కథ’న కుతూహల సహవాసి బాలాజీ – అన్న మరో ముందుమాటలో ‘తన రచనల్లో జీవితపు వేదనా పార్శ్వాలను సమాజ రుగ్మతలను స్పర్శిస్తూ, పాఠకుడికి నిజ జీవిత చిత్రణను కళ్ళకు కట్టినట్టు అక్షరబద్ధం చేస్తాడు. ఎక్కడా రాజకీయాలను, సంబంధిత వైరుధ్యాలను విడవకుండా కథను చిత్రిస్తారు’ అని డి.కుమారస్వామి రెడ్డి రాశారు.
చిగురించే మనుషులు (కథలు)
రచన: పలమనేరు బాలాజీ
పేజీలు: 168; వెల: 100
ప్రతులకు: కె.ఎన్.జయమ్మ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010
ఇంకా నవోదయ, ప్రజాశక్తి, విశాలంధ్ర బుక్ హౌజ్ శాఖలు