పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌కు తెలుగు సాహిత్య కళాపీఠం వారి సహస్ర పద్యకంఠీరవ చిక్కా రామదాసు స్మారక విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నవంబర్13 న జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంతర్జాతీయ పాత్రికేయ ప్రముఖులు ఎస్. వెంకటనారాయణ చేతులు మీదుగా శాలువా, మెమెంటోలతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు డా. ఈటెల సమ్మన్న, విశిష్ట అతిథులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, జస్టిస్ నిమ్మ నారాయణ, నేటినిజం దినపత్రిక సంపాదకులు బైస దేవదాసు, ప్రముఖ జ్యోతిష్కులు దైవజ్ఞశర్మ, సినీ గేయరచయిత మౌనశ్రీమల్లిక్, కురిమిళ్ళ నరసింహగౌడ్, డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి, చిక్కా దేవదాసు, చిక్కా రవికిరణ్, పట్టాల అశోక్, తాటికొండ పట్టాభి, వేలూరి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

