సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    కస్తూరి మురళీ కృష్ణ

    Omment by sri gorrepati srinu
    జరుగుతున్న సంఘటనలకి మీరిచ్చిన అక్షరరూపం బాగుంది.కథనం వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ సాగింది.కృతజ్ఞతలతో…శ్రీను.

    Reply
  2. 2

    Ramani

    Wonderfully narrated..balanced ga chepparu vaastavaalu!agyaanam matha moudhyam oka chota undakudadhu..ippudu chudaalsindi andari praanaalu sari samaanam ani..Om🙏

    Reply
  3. 3

    Sambasiva Rao Thota

    MuraliKrishna Garu!

    Karona timelo mee katha vaasthavaaniki addam
    Pattinatlundi !
    Yelaanti vipathkara paristhithullo koodaa maanava sambandhaalanu
    maravakoodadane Mee sandesham adhbhutham …

    Abhinandanalatho ….
    Sambasivarao Thota

    Reply
  4. 4

    జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

    కథ పేరు పెద్దది. కథావస్తువు ఇంకా పెద్దది. దాన్ని నిర్వహించిన తీరు మరీ పెద్దది. ఆ విధంగా తన పెద్దరికం నిలుపుకున్న కథ ఇది. కరోనాలు వస్తాయి. పోతాయి. కానీ కథలు ఉండిపోతాయి. ఏడాది తరవాత కరోనా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. కానీ పాతికేళ్ల తరవాత మాటల్లోకి ఇందులోని పాత్రలన్నీ వస్తాయి. విలయం లయమైపోయినా హృదయం మాత్రం లయం కాదు. ఆలయం అవుతుంది. మనుషులకి మతం ఉంటుందిగానీ ఆలయానికి మతం ఉండదు.

    Reply
  5. 5

    Srinivasa Prasad

    ఓ సంక్లిష్టమైన సమకాలీన అంశాన్ని తీసుకుని ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా హృద్యంగా రచన చేయడం, అందులోనూ సున్నితంగా సమాజంలోని లోటుపాట్లను హెచ్చరించడం సాధారణమైన విషయంకాదు…
    కథలోని ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి సన్నివేశాలను అద్భుతంగా అక్షరీకరించిన మురళీకృష్ణగారికి అభినందనలు.

    Reply
  6. 6

    vasundhara

    మే 17న ఆదివారం ఆంధ్రజ్యోతిలో అఫ్సర్ గారి ‘చూపుడు వేలు‘ – ప్రపంచమంతా ఏకమై ఎదుర్కొంటున్న ఓ మహమ్మారి సమస్యకి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తూ – మిగతా వేళ్లని పట్టించుకోలేదు. అందువల్ల ఆయన మనసొక వూహాన్‍గా మారి మరో కరోనాకి జన్మనిచ్చేందుకు దోహదం చేస్తోంది. ఆ కరోనా సోకకుండా, పాకకుండా తీసుకోవాల్సిన అత్యవసరమైన జాగ్రత్తల్ని అందించడానికి కస్తూరి మురళీకృష్ణ గారు చూపుడు వేలు కాక మిగతా వేళ్లని ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ప్రమాదకరమైన మానసిక రోగుల్నించి ఆవిర్భవించే కరోనాల్ని నిస్తేజం చెయ్యడానికి ఇలాంటి కథలే వాక్సిన్లు. కస్తూరి వారికి అభినందనలు.

    నిజానికి అఫ్సర్ గారి కథలో కూడా మిగతా నాలుగు వేళ్లూ ఉన్నాయి. అవి రజియా పాత్రవి. చూపుడువేలుకి ప్రాధాన్యమివ్వడానికి అలవాటుపడ్డ ప్రముఖులలాగే వారూ ఆ నాలుగువేళ్లనూ పట్టించుకోతగ్గవిగా భావించలేదు.

    ఇదే కథపై అమెరికా వాస్తవ్యులు, ప్రముఖ రచయిత తాడికొండ శివకుమారశర్మ గారు స్పందించిన తీరు ప్రతిభావంతం. విమర్శకులకు, సాహితీప్రియులకు, సమాజహితైభిలాషులకు ఎంతో ప్రయోజనాత్మకం. ఈ విషయమై మా బ్లాగులో అందించిన టపాకు లంకెః [Link deleted]

    Reply
  7. 7

    sannihith

    చాలా బాగుంది సార్ కథ.. అన్నివైపులా ఆలోచించి వ్రాసారు..హృదయపూర్వక అభినందనలు – సన్నిహిత్

    Reply
  8. 8

    Halley

    “రాధ వైపు చూశాడు. కాంపౌండ్ వాల్‍కు ఆవైపు నుండి ఇటే చూస్తున్న అఫ్రోజ్ మనవళ్ళ వైపు చూశాడు.”
    ఇక్కడ కూడా పర్వేజ్ మనవళ్ళు కాదా?
    నేనే తప్పుగా అర్థం చేసుకొని ఉండచ్చేమో. కుదిరితే నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి!

    Reply
    1. 8.1

      కస్తూరి మురళీ కృష్ణ

      Yes..thank you..corrected….by the way what is your opinion on the story?

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మురళీకృష్ణ గారూ ,
    నమస్కారం .గతంలో మీ కథలు ,ముఖ్యంగా
    క్రైమ్ కథలు ,చాలా చదివాను .చాలా కాలం
    తరువాత ,ఈ కరోనా నేపథ్యంతో రాసిన కథ చదివి
    ఇది రాస్తున్నాను .ఈ కథ చదివే అవకాశం కల్పించి న ,” సంచిక ” పత్రికకు దన్యవాదాలు.
    కరోనా వైరస్ ,అది వ్యాప్తి చెందడానికి కారణభూతాలైన అనేకమైన అంశాలను పరిగణలోనికి తీసుకుని ,ఇంకా మనమధ్యే హాయిగ
    సంచరిస్తున్న కరోనా గురించి విస్తృతమైన పరిధిని
    ఎన్నుకుని కథ రాసి ,సఫలీకృతం అయ్యారని నేను
    నమ్ముతున్నాను.
    ఇలాంటి కథలు రాయటం కష్టమని నా ..ఈ చిన్ని
    బుర్రకు తెలుసును .ఎందుచేతనంటే ,ఎన్నో
    ముఖ్య మయిన ,సున్నితమైన అంశాలు దీనితో
    ముడిపడి ఉన్నాయి .స్నేహం ,మతం ,పొరుగు ,
    రాజకీయ పార్టీలు ,కొందరు దేశద్రోహుల అసత్య
    ప్రచారాలు,రెచ్చగొట్టడాలు ,ఒకరిపట్ల మరొకరికి
    అవగాహన రాహిత్యం….ఇలా ..ఎన్నో ..ఎన్నెన్నో !
    వీటన్నింటిని దృష్టిలొ ఉంచుకుని ,ఒక బాధ్యతగల
    కథా రచయితగా ,అందరికి అసలు విశయం అర్ధమయ్యేలా ,సమ తూకంలో కథను నడిపించిన
    మీరు ,అభినందనీయులు.కరోనా ..నేపధ్యంగా
    ఒక కథా సంకలనం ఆశించవచ్చునేమో !!

    _____డా.కె .ఎల్.వి .ప్రసాద్ ,
    హనంకొండ.
    0870_2432098

    Reply
  10. 10

    kovelas@gmail.com

    ఈ కథపై ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా తక్కువే. ఈ దేశంలో ముస్లిం సంతుష్టీకరణ పరాకాష్టకు చేరిన ఫలితం మర్కజ్.. కరోనా వ్యవహారం. పరీక్షలు చేయించుకొమ్మన్నందుకు దాక్కోవడాలు.. దాడులు చేయడాలను సమర్థించేవాళ్లను ఏమనాలి? కస్తూరి మురళిగారు ఇంకా చాలా సున్నితంగా.. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా.. సంతులనం కోల్పోకుండా కథను.. కథనాన్ని నడిపించారు. నిజానికి మతప్రమేయం లేని రాజ్యంలో మత ప్రాతిపదికన మైనార్టీలను గుర్తించి.. వారికి సకల రాజభోగాలను కల్పిస్తూ.. అడుగు వేస్తే ఎక్కడ కందిపోతుందో అన్నంత సున్నితంగా వాళ్లను చూస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛల పేరుతో అడ్డగోలుగా మాట్లాడుతుంటే.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. నెహ్రూ నుంచి మోదీ వరకు చేస్తున్న దౌర్భాగ్యపు పాలన ఫలితమే ఇది. మైనార్టీలు.. అన్న పేరుతో కాకుండా.. హిందుస్తాన్లోని ఒక పౌరుడిగా మాత్రమే ప్రభుత్వాలు ప్రతి ఒక్కరినీ ట్రీట్ చేసి ఉంటే.. అసలు ’చూపుడువేలు‘ చూపించే ధైర్యమే ఎవరూ చేసేవారు కాదు.. ఇప్పడు ఈ నాలుగు వేళ్లను చూపించాల్సిన అవసరమూ వచ్చేది కాదు.

    Reply
  11. 11

    శివకుమార శర్మ

    కరోనా వ్యాప్తి నరికట్టడానికి తీసుకున్న చర్యలలో విధినిర్వహణలో అత్యవసర పాత్రని నిర్వహించింది వైద్యశాఖతో బాటు రక్షణశాఖ కూడా. అల్లర్లను ఆపడానికి అప్పుడప్పుడూ ప్రభుత్వం కర్ఫ్యూలని విధించడం, ఆ ప్రభుత్వానికి కన్ను పొడవాలన్న సంకల్పంతో కొంతమంది దాన్ని నీరు కార్చడానికి పూనుకున్నట్లుగా వీధులలోకి రావడాన్ని చూడడం ప్రజలు ఎప్పుడో అలవాటు పడ్డారు. ఈ కరోనా సమయంలో కూడా ఆ అలవాటుకు బానిసలైనట్టుగా కొంతమంది వీధులలోకి రావడాన్ని సోషల్ మీడియాలో చూశాం. దానితోబాటే, విధి నిర్వహణ కుంటు పడకుండా అక్కడక్కడ జీపులోనే కూర్చుని భోజనం చేస్తున్న ఎస్సైలు, సీఐలని కూడా. వారు ఈ కథలో ప్రముఖ పాత్ర ధరించడం అభినందనీయం. (వారి కృషికి అభినందనలు తెలుపుదాం అంటే సోషల్ మీడియాలో దాన్ని హేళన చేసిన వ్యక్తులూ ఉన్నారు.) కథలో కావలసినంత డ్రామా ఉన్నది. సందేశాత్మకం. కరోనాతో సంబంధ మున్న అన్నిరకాల అంశాలనీ స్పృశించడం వల్ల కాన్వాస్ విస్తృత మైనది. ప్రభుత్వ సంకల్పాన్ని నీరు గార్చేట్లుగా కొంతమంది ప్రవర్తించకుండా ఉండుంటే కృషికి మాత్రమే కాకుండా ఫలితాలతో కలిపి సి బదులు ఎ గ్రేడ్ వచ్చేది. కరోనా వేలెత్తి చూపింది మాత్రం సమాజంలో ఆంతర్యాన్ని అర్థం చేసుకుని మసులు కోవడంలో ఉన్న విస్తృతమైన గాప్ ని. ఇది దిశానిర్దేశాన్ని ఒక చట్రం మీద కర్రకు కట్టిపెట్టి ఆ చట్రాన్ని గిర్రున తిప్పడం లాంటిది. అంటే, ఇది వేలెత్తి కేవలం ఒకరిని చూపేది గాదు – అందరికీ దీనిలో భాగ మున్నది సత్ఫలితాలకీ, దుష్ఫలితాలకీ గూడా. దీనికి విరుగుడు కనీసం రాబోయే తరాలనన్నా సమాజాన్ని తీర్చిదిద్దేలా – అంటే, కేవలం ప్రతిభావంతులుగా తయారు చెయ్యడం మీద మాత్రమే గాక గాక , సమాజం మీద చెడు కలగజేసే దుష్ఫలితాల గూర్చి ఆలోచించేలా చెయ్యగలిగేలా – విద్యావిధానాన్ని రూపొందించ గల్గడం. ఈ ఆలోచనతో రాసిన నా కథ “రేపటి ఆశాకిరణాలు” ‘రచన’ మాసపత్రిక ఆగష్ట్ 2006 లో వెలువడింది.

    Reply
  12. 12

    vidadala sambasivarao

    కరోనా నేపథ్యంలో కథ రాయడం సులభమే.కానీ,”మర్కజ్”ని ఆధారం చేసుకుని హిందూ ముస్లిం సమాజాల మనసులను నొప్పించకుండా…ప్రస్తుత పరిస్థితులలో కథనాన్ని నడిపించడం ఎంతో కష్టం.ఈ క్లిష్టమైన పరిస్థితులలో సామాజికంగా విభిన్న వర్గాల మధ్య సానుకూలతను…సమైక్యతను పెంపొందించే దిశగా రచయిత తన కలాన్ని ముందుకు నడిపించాలి.
    శ్రీ మురళీకృష్ణ గారు సాహితీ రంగంలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ కధ రాయడం ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. భారతదేశం లౌకిక రాజ్యమని ఈ కధ ద్వారా స్పష్టంగా తెలియజేశారు.
    శుభాభినందనలు సర్.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  13. 13

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by poetess v n manjula
    👆🏽 చదివాను సార్.. చాలా చాలా గొప్పగా వివరించారు… వాస్తవాన్ని కళ్ళకి కట్టిచూపించారు..
    ఎవ్వరినీ నొప్పింపకుండా చెప్పగలగడం గొప్ప విషయం..
    నాలుగు + ఒకటి= ఐదు వేళ్ళ సమాహార హస్తంతో కలిపి వందనాలు..🙏🏽🙏🏽

    Reply
  14. 14

    sarat

    చూపుడువేలు కాక..ను కధ అనడం కంటే అక్షరాయుధంగా భావించడం మేలు .రచనా శైలి
    చదువరి మది లోకి దూసుకెళుతుంది.నిలదీసి, నిగ్గు తేల్చి, లోలోపలి నిజాన్ని వెలికి తీసుకొస్తుంది. అది ఎంతో సూటిగా చాలా ఘాటుగా సాగించిన శస్త్రచికిత్స.

    Reply
  15. 15

    Satya

    Well balanced story
    Identity: (religion, role, friend) and responsibilities are clear in this story.

    Reply
  16. 16

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by sri Gangishetty Lakshmi Narayana
    ఆదర్శవంతమైన భారతీయుడిలా, వర్తమాన సమస్యలో అతి ముఖ్యమైన కోణాన్ని ఎంచుకొని, ఎంతో సమన్వయంతో, సామరస్య భావం పెంపొందేలా రాశారు… ఒకప్పటి హైదరాబాద్ సంస్కృతికి పునరుద్దీపనంలా… ప్రతి వారిలో పౌర బాధ్యత మేల్కొనేలా… మేల్కొలిపేలా.. హార్దిక
    అభినందనలు!!

    Reply
  17. 17

    వారణాసి నాగలక్ష్మి

    సాహిత్యమంతటినీ కలిపి రెండు వర్గాలుగా విభజించవచ్చని నా నమ్మకం.

    మొదటిది- పాఠకులలో సానుకూలత పెంచి సమాజానికి హితం కలిగించేది.
    రెండోది- పాఠకులలో నకారాత్మక భావజాలాన్ని మొలకెత్తించి సమాజానికి కీడు చేసేది.
    రచయితలు తాము ఏం రాయదలచినా ఈ రెండు వర్గాలలో దేనికి చెందేలా రాయబోతున్నారో తెలుసుకుని రాయవలసిన అవసరం ఉంది.

    అలాగే పాఠకులు ఏం చదివినా దాని వల్ల తాము నివసించే సమాజానికి చెడు జరగకుండా జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉంది.

    మొదటి వర్గానికి చెందిన కథ రాసినందుకు కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు!

    Reply

Leave a Reply to కస్తూరి మురళీ కృష్ణ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!