Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-102

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన ఈ సినిమాకి కథ మల్లాది రామకృష్ణశాస్త్రి. సంగీతం టి.వి. రాజు మరియు ఓగిరాల రామచంద్రరావు. ఆర్. ఎస్. సెల్వరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన ఈ సినిమా పేరేమిటి? (క్లూ: ‘వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది కాదురా’ అనే పాట ఇందులోదే).
  2. అక్కినేని, అంజలీదేవి, జమున నటించిన ‘ఇలవేల్పు’ అనే సినిమాకి ఆధారం శివాజీ గణేశన్, పద్మిని, ఎస్. వరలక్ష్మి, నాగయ్య నటించిన తమిళ సినిమా ‘ఎదిర్ పరాదతు’. ఈ సినిమాలోని ‘చల్లని రాజా ఓ చందమామ’ అనే పాటని పి.సుశీల, పి.లీల గార్లతో పాటు పాడిన గాయకుడెవరు?
  3. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి నటించిన ‘స్త్రీ సాహసము’ అనే సినిమాకి సంగీతం సి. ఆర్. సుబ్బరామన్ అందించారు. ఈ సినిమాకి ఛాయాగ్రహకుడెవరు?
  4. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., మాలతి, ఎస్.వి. రంగారావు నటించిన ‘పాతాళభైరవి’ అనే చిత్రంలోని ‘రానంటే రానే రాను’ అనే పాటలో నటించిన తార ఎవరు? (క్లూ: మాయామహల్ సెట్టింగ్‍లో వస్తుందీ పాట)
  5. ఎన్.టి.ఆర్., భానుమతి, ఎస్. వి. రంగారావు నటించిన ‘చండీరాణి’ (1952) చిత్రానికి సి. ఆర్. సుబ్బరామన్, ఎం.ఎస్. విశ్వనాధన్-రామ్మూర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకి కథని సమకూర్చినది ఎవరు?
  6. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు గార్లు కథ, మాటలు అందించగా ఎన్.టి.ఆర్, సావిత్రి నటించిన ఏ సినిమాకి ఘంటసాల సంగీతం అందించారు? (క్లూ: చెయెత్తి జైకొట్టు తెలుగోడా పాట ఈ సినిమాలోదే).
  7. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని, జమున నటించిన సినిమాకి కథ కె. ప్రత్యగాత్మ అందించగా, టి. వి. రాజు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు? (క్లూ: అమ్మలారా విన్నారా అయ్యలారా కన్నారా అనే పాట ఈ సినిమాలోదే).
  8. మూలా నారాయణ స్వామి నిర్మాతగా, హెచ్.ఎం. రెడ్డి సమర్పణలో, వై.ఆర్. స్వామి దర్శకత్వం వహించిన ఏ చిత్రంలో ఎన్.టి.ఆర్., షావుకారు జానకి, జమున నటించారు? (క్లూ: ది బ్రూస్టర్స్ మిలియన్స్ (1902) అనే ఆంగ్ల నవల ఆధారంగా రూపొందించబడిన చిత్రం)
  9. పాలగుమ్మి పద్మరాజు పరిచయమైన ఈ చిత్రం జార్జ్ ఇలియట్ రచించిన ‘సైలాస్ మర్నర్’ అనే ఇంగ్లీషు నవల ఆధారంగా తెలుగులో తీశారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఎస్వీ.రంగారావు, కొంగర జగ్గయ్య, కృష్ణకుమారి, జమున నటించారు. సినిమా పేరేమిటి?
  10. తాపీ చాణక్య దర్శకత్వంలో అక్కినేని, షావుకారు జానకి నటించిన ‘రోజులు మారాయి’ (1955) చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం అందించారు. ఈ సినిమాకి కథని ఎవరు అందించారు??

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఆగస్టు 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 102 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఆగస్టు 25 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 100 జవాబులు:

1.ఎవరా స్త్రీ (1966) 2. ధనమే ప్రపంచలీల (1967) 3. కాలచక్రం (1965) 4. అంతులేని హంతకుడు (1968) 5. పెళ్ళంటే భయం (1967) 6. శ్రీమంతులు (1968) 7. కొండవీటి సింహం (1969) 8. ప్రేమ మనసులు (1969) 9. శభాష్ రంగా (1967) 10. బందిపోటు భయంకర్ (1972)

సినిమా క్విజ్ 100 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version