Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-105

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. మొదట ఈ చిత్రానికి అనిసెట్టి సుబ్బారావు దర్శకులుగా అనుకొని తర్వాత ఆదుర్తి సుబ్బారావుగా నిర్ణయించారు. యీ చిత్రంలో అక్కినేని, అంజలీదేవి ప్రధాన తారాగణం. సంగీతం ఎస్. రాజేశ్వర రావు – మాస్టర్ వేణు. కథ, మాటలు పినిశెట్టి రామమూర్తి గారు అందించిన ఈ చిత్రం పేరు? (క్లూ: పదరా పదరా చల్ బేటా పల్లెటూరికి – అనే పాట ఈ సినిమాలోనిదే)
  2. ఎ.వి.ఎం. వారి ‘భూకైలాస్’ (1958) చిత్రంలో రావణునిగా NTR, నారదుడిగా అక్కినేని నటించారు. మాధవ బుల్‍బుల్ ఛాయాగ్రాహకుడు. మాటలు సముద్రాల (సీ), సంగీతం ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం, దర్శకుడు కె. శంకర్. ఇందులో కుంభకర్ణుని పాత్ర పోషించిన నటుడు ఎవరు?
  3. కె. ఎస్. రాఘవన్, కె. ఎస్. రామచంద్ర రావుల దర్శకత్వంలో, టి. నామదేవరెడ్డి నిర్మించిన ‘సారంగధర’ (1957) చిత్రంలో NTR, SVR, రాజసులోచనలు నటించగా కథ-మాటలు- సముద్రాల సీనియర్ అందించారు. ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మూలమైన నాటకం ఏది?
  4. బెంగాలీ నవల “బిందూర్ ఛేలే” రచించినది శరత్ చంద్ర చటర్జీ, దీని ఆధారంగా తెలుగులో ఆరుద్ర, తాపి ధర్మారావు సంభాషణలు రచించగా, పెండ్యాల సంగీత దర్శకత్వంలో B. తిలక్ దర్శకత్వంలో జమున, జగ్గయ్యలతో తీసిన చిత్రం?
  5. అక్కినేని, సావిత్రి, శ్రీరంజని, ఎస్వీరంగారావు నటించిన ‘సంతానం’ (1955) చిత్రానికి దర్శకుడు సి.వి. రంగనాధదాసు కాగా దర్శకత్వ పర్వవేక్షణ ఎల్. వి. ప్రసాద్ చేయగా, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులెవరు?
  6. సి.ఎస్.రావు దర్శకత్వంలో అక్కినేని, జమున నటించిన ‘శ్రీకృష్ణ మాయ’ (1958) చిత్రానికి ఆధారం వారణాసి సీతరామశాస్త్రి గారి నాటకం ‘నారద సంసారం’. శ్రీకృష్ణునిగా రఘురామయ్య వేయగా, ఇంద్రునిగా వేసిందెవరు?-
  7. అక్కినేని, భానుమతి నటించిన ‘ప్రేమ’ (1952) చిత్రానికి దర్శకుడు 5. రామకృష్ణ. సంగీతం C.R. సుబ్బరామన్. ఈ సినిమాకి కథ వ్రాసినదెవరు? “
  8. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో జమునలు నటించిన ‘భాగ్యరేఖ’ (1957) చిత్రానికి సంగీతం పెండ్యాల, ఛాయాగ్రాహకుడు B.N.కొండారెడ్డి. కథను సమకూర్చినది ఎవరు?
  9. బి.ఎ. సుబ్బారావు దర్శకుడిగా అక్కినేని, అంజలీదేవి, SVR, రేలంగి నటించిన ‘చెంచులక్ష్మి’ (1958) చిత్రానికి సంగీతం ఎస్. రాజేశ్వర రావు. కథ రచన సదాశివబ్రహ్మం, ఇందులో శివునిగా నటించిన పాత్రధారి ఎవరు?
  10. ఎ.ఎం. రాజా (ప్లేబాక్ సింగర్) మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రంలో NTR, అంజలీదేవి నటించగా మాటలు DV నరసరాజు వ్రాశారు. కెమెరా ‘అన్నయ్య’. చిత్రం పేరు? (క్లూ: అందాలచిందు తార డెందాన దాచనేల – అనే పాట ఈ సినిమా లోనిదే).

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 సెప్టెంబర్ 10 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 105 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 సెప్టెంబర్ 15 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 103 జవాబులు:

1.ది ఫాబ్యులస్ సెనోరిటా 2. ఎస్.వరలక్ష్మి 3. ఉమాసుందరి; నాగభూషణం, ఎన్.టి. రామారావుపై పాట చిత్రణ (1956) 4. శారద 5. ది ప్రిన్స్ హూ వజ్ ఎ థీప్ 6. కె. వి. రెడ్డి 7. విశ్వనాథన్-రామ్మూర్తి 8. ఆదుర్తి సుబ్బారావు 9. నటుడు శ్రీరాం, వి. గోవిందరాజన్ 10. ఎ. ప్రకాశరావు

సినిమా క్విజ్ 103 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version