Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-11

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘మంచి మనసులు’ చిత్రానికి తమిళ మాతృక ఏది?
  2. ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి నటించిన ‘మంచి-చెడు’ చిత్రానికి తమిళ మాతృక ఏది?
  3. గురు దత్, ఆశా పరేఖ్‍లు నటించిన హిందీ చిత్రం ‘భరోసా’ ఏ తెలుగు చిత్రానికి ఆధారం?
  4. బి.ఆర్. పంతులు నిర్మించిన ‘తంగమలై రహస్యం’ తెలుగులో స్ట్రెయిట్ చిత్రంగా ఏ పేరున వచ్చింది?
  5. ఎం.జి.ఆర్. నటించిన తమిళ చిత్రం ‘పణతొట్టం’ ఏ పేరున తెలుగులో డబ్ అయింది?
  6. శివాజీ గణేషన్, బి. సరోజాదేవి నటించిన తమిళ చిత్రం ‘ఆలయమణి’ తెలుగులో ఏ పేరిట వచ్చింది?
  7. ఎస్. ఎస్. రాజేంద్రన్, విజయకుమారి నటించిన తమిళ చిత్రం ‘శారద’ తెలుగులో ఏ పేరిట వచ్చింది?
  8. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘భలే కోడళ్లు’ చిత్రానికి మాతృక అయిన తమిళ చిత్రం ఏది?
  9. ఎన్.టి.ఆర్., రాజనాల నటించిన మొదటి చిత్రం ఏది (1954లో వై.ఆర్.స్వామి దర్శకత్వంలో జానకి, జమున, పేకేటి ఇతర ముఖ్య తారాగణం)?
  10. దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్ది గారు ‘బంగారు పాప’ను విదేశాల్లో ప్రదర్శించు వేళ ఇంగ్లీషులో కామెంటరీ వ్రాసి చదివిన వంగ దర్శకుడు ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 నవంబరు 22వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 నవంబరు 27 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 9 జవాబులు:

1.నమ్‌నాడు 2. ఆజాద్, దిలీప్ కుమార్ 3. పల్లెటూరి చిన్నోడు 4. నెంజి యిరుక్కుమ్ వరై 5. జయ్ విజయ్ 6. ఉధార్ కా సిందూర్ 7. జెమిని గణేశన్, కె. ఆర్. విజయ 8. వంగర వెంకట సుబ్బయ్య (పేకేటి శివరాం విచిత్రగుప్తుడు) 9. ఎరడు కణుసు 10. మూగనోము

సినిమా క్విజ్ 9 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version