Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-111

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. హుణుసూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో కాంతారావు, వాణిశ్రీ, చలం నటించిన ‘దేవుని గెలిచిన మానవుడు’ (1967) సినిమాలో యమునిగా నటించినదెవరు?
  2. కె. బి. నాగభూషణం దర్శకత్వంలో కాంతారావు, ఎస్.వి.రంగారావు, జమున, కన్నాంబ నటించిన ‘ఉషాపరిణయం’ (1961) సినిమాలో శివుడిగా నటించినదెవరు?
  3. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి నటించిన ‘మా బాబు’ (1960) సినిమా ఏ హిందీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది?
  4. బి.ఆర్. పంతులు దర్శకత్వంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, పద్మిని, సావిత్రి నటించిన ‘వీరపాండ్యకట్టబొమ్మన్’ (1959) సినిమాకి శివాజీ గణేశన్‍కి తెలుగులో ఎల్లప్పుడూ డబ్బింగ్ చెప్పే జగ్గయ్య గారు కాకుండా మరొకరు డబ్బింగ్ చెప్పారు. వారెవరు?
  5. సి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, హేమలత, కాంతారావు, ఎస్.వి. రంగారావు నటించిన ‘దేవాంతకుడు’ (1960) సినిమాలో చిత్రగుప్తునిగా నటించినదెవరు?
  6. హిందీ సినిమా ‘లాజ్‌వంతి’ ఆధారంగా, డి. యోగానంద్ దర్శకత్వంలో నిర్మితమైన ఓ తమిళ సినిమాలో అక్కినేని, అంజలీదేవి నటించారు. ఆ సినిమాని తెలుగులో ‘కన్నకూతురు’ (1960) పేరుతో డబ్ చేశారు. తమిళ సినిమా పేరేంటి?
  7. ఎస్. రజనీకాంత్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ఎస్. వి. ఆర్., అంజలీదేవి నటించిన ‘సతీ సులోచన’ (ఇంద్రజిత్) (1961) చిత్రంలో నారదుడిగా నటించినదెవరు?
  8. కె. కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., గుమ్మడి, దేవిక, ఎస్. వరలక్ష్మి నటించిన ‘మహామంత్రి తిమ్మరుసు’ (1962) సినిమాలో అల్లసాని పెద్దనగా నటించినదెవరు?
  9. సి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అంజలీదేవి, కాంతారావు, రేలంగి నటించిన ‘లవకుశ’ (1963) సినిమాలో ఆంజనేయుడిగా నటించినదెవరు?
  10. సముద్రాల సీనియర్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ఎస్. వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి నటించిన ‘బభ్రువాహన’ (1964) సినిమాలో బలరాముడి పాత్రలో నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 అక్టోబర్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 111 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 అక్టోబర్ 27 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 109 జవాబులు:

1.ముక్కామల కృష్ణమూర్తి 2. శారద 3. జయలలిత 4. మాధవ్ బుల్‌బులే 5. వన్ థౌజండ్ బెడ్ రూమ్స్ 6. రఘురామయ్య 7. లక్ష్మీ త్రిపుర సుందరి 8. ఎ. వి. సుబ్బారావు 9. The Daughter of the Condemned, Frank Barrett 10. షావుకారు జానకి

సినిమా క్విజ్ 109 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version