Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-122

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎస్.డి. లాల్ దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., దేవిక, రాజబాబు, ఎల్. విజయలక్ష్మి నటించిన ‘నిండు మనసులు’ (1967) చిత్రానికి ఏ హిందీ సినిమా ఆధారం?
  2. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, సావిత్రి, ఎస్. వరలక్ష్మి తదితరులు నటించిన ‘ఉమ్మడి కుటుంబం’ (1967) సినిమాలో నాగభూషణం అసిస్టెంట్ సుబ్బయ్యగా నటించినదెవరు?
  3. కె. బి. తిలక్ దర్శకత్వంలో శోభన్ బాబు, గీతాంజలి, వాణిశ్రీ, గుమ్మడి నటించిన ‘పంతాలు పట్టింపులు’ (1968) చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకి కథానాయకుడిగా మొదట అనుకున్న హీరో ఎవరు?
  4. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, జయలలిత, సూర్యకాంతం తదితరులు నటించిన ‘తిక్క శంకరయ్య’ (1968) సినిమాలో సోడాబుడ్డి సుబ్బయ్య పాత్ర పోషించిన నటుడెవరు?
  5. Charlotte Bronte రచించిన Jane Eyre అనే ఆంగ్ల నవల ఆధారంగా, పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో జగ్గయ్య, భారతి నటించిన చిత్రం ఏది?
  6. కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., జయలలిత, చలపతిరావు, నాగభూషణం తదితరులు నటించిన ‘కథానాయకుడు’ (1969) చిత్రంలో పద్మనాభం (నరసింహం పాత్రధారి) ‘బామ్మ’ వేషం ఎవరు వేశారు?
  7. తమిళంలో 1968లో వచ్చిన ‘ఎంగ ఊర్ రాజా’ అనే సినిమా ఆధారంగా, ఎ.సంజీవి దర్శకత్వంలో రూపొందిన ‘ధర్మదాత’ (1970) చిత్రంలో అక్కినేని, కాంచన, షావుకారు జానకి ప్రధానపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ‘విజయపురి యువరాణి’గా నటించినదెవరు?
  8. సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., వాణిశ్రీ, జగ్గయ్య, శారద తదితరులు నటించిన ‘జీవితచక్రం’ (1971) చిత్రంలో రమణారెడ్డి ధరించిన పాత్ర పేరేమిటి?
  9. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, కాకరాల, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ (1971) చిత్రంలో నక్కజిత్తుల నాగన్న పాత్రలో నటించినదెవరు?
  10. 1969లో వచ్చిన ‘దో భాయీ’ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన చిత్రంలో కృష్ణ, కాంచన, గుమ్మడి నటించారు. వేదా (ఎస్.ఎస్.వేదాచలం) సంగీతం అందించిన ఈ చిత్రం పేరేమిటి? (క్లూ: ‘పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం’ అనే పాట ఇందులోదే).

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2025 జనవరి 07వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 122 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 జనవరి 12 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 120 జవాబులు:

1.వెంపటి సదాశివబ్రహ్మం 2. కె.ఎస్.ఆర్. దాస్ 3. తాపీ ధర్మారావు 4. నయీ రోష్నీ 5. మిక్కిలినేని 6. నాడోడి మన్నన్ 7. మళ్ళీ పెళ్ళి 8. మదర్ ఇండియా 9. పి. ఆదినారాయణరావు 10. జ్యోతిలక్ష్మి

సినిమా క్విజ్ 120 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version