Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-28

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎన్.టి.ఆర్., అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్‍లు నటించిన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రంలో రాక్షసమంత్రిగా నటించిన నటుడు ఎవరు?
  2. బాపు దర్శకత్వంలో కృష్ణ, జగ్గయ్య, జయప్రదలు నటించిన చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఆ చిత్రం పేరు?
  3. హిందీ చిత్రం ‘విక్టోరియా-203’లో అశోక్ కుమార్, ప్రాణ్‌లు నటించిన పాత్రల్ని తెలుగులో ఎవరితో చేయించారు? ఆ సినిమా పేరేమిటి?
  4. ఎన్.టి.ఆర్., మంజుల నటించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ అనే చిత్రానికి ఏ హిందీ చిత్రం ఆధారం?
  5. హిందీ చిత్రం ‘కువారా బాప్’లో మొహమూద్, మనోరమలు నటించగా, యీ చిత్రాన్ని పద్మనాభం ఏ పేరుతో తెలుగులో తీశారు?
  6. ‘బాబులు గాడి దెబ్బ అంటే గోలుకొండ అబ్బ అనాలి’ అనే పదాలని ఏ నటుడు పలికారు? అక్కినేని, సావిత్రి నటించిన కె. వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిందీ సినిమా.
  7. సునీల్ దత్ హిందీలో నటించిన ఒకే ఒక పాత్ర ఉన్న సినిమా ఏది?
  8. సముద్ర తీరంలో ‘దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే’ అను పాట్ను ఎన్.టి.ఆర్., కృష్ణకుమారిలపై చిత్రీకరించినప్పుడు పెద్ద అల వచ్చి యిద్దర్నీ లోపలికి తీసుకొనిపోయినా, ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి చేయి గట్టిగా పట్టుకుని బైటికి తెచ్చారు. ఆ సినిమా ఏది?
  9. బి.ఎ. సుబ్బారావు నిర్మించిన ‘చెంచులక్ష్మి’ సినిమాలో నారదుడిగా ఎవరు నటించారు?
  10. విజయ వారి ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని హిందీలో ‘స్వయంవర్’ పేరిట రీమేక్ చేశారు. హిందీలో సావిత్రి పాత్రలో ఎవరు నటించారు?
  11. భారతదేశపు మొట్టమొదటి టెక్నికలర్ సినిమా ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మార్చి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 28 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మార్చి 26 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 26 జవాబులు:

1.సీతారాములు 2. ఎం.ఎస్. విశ్వనాథన్ 3. నవ వసంతం 4. మిస్టర్ పెళ్ళికొడుకు 5. నిన్నే ప్రేమిస్తా 6. స్నేహమంటే ఇదేరా! 7. సుస్వాగతం 8. రాజా 9. అన్నవరం 10. సింహరాశి

సినిమా క్విజ్ 26 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version