Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-80

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, శ్రీదేవి, జయసుధ నటించిన ‘త్రిశూలం’ (1982) సినిమా హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, జయప్రద, శ్రీదేవి లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. దేవా కట్టా దర్శకత్వంలో శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ నటించిన ‘ప్రస్థానం’ (2010) చిత్రాన్ని హిందీలో దేవా కట్టా దర్శకత్వంలో సంజయ్ దత్, అల్ ఫజల్, జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. ఎ. మోహన్‍గాంధి దర్శకత్వంలో విజయశాంతి, వినోద్ కుమార్ నటించిన ‘కర్తవ్యం’ (1990) సినిమా హిందీలో ఎన్. చంద్ర దర్శకత్వంలో విజయశాంతి, దీపక్ మల్హోత్రా, చరణ్ రాజ్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. బి. గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, అమల నటించిన ‘రక్త తిలకం’ (1985) చిత్రాన్ని హిందీలో టి. రామారావు దర్శకత్వంలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ, జయప్రద నటించిన ‘రహస్య గూఢచారి’ (1981) సినిమా హిందీలో రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో జితేంద్ర, పర్వీన్ బాబీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి, ప్రకాష్ రాజ్ నటించిన ‘నువ్వొస్తానంటే వద్దంటానా’ (2005) చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో గిరీష్ కుమార్, శ్రుతి హసన్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ పోతినేని, జెనీలియా నటించిన ‘రెడీ’ (2008) సినిమా హిందీలో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, అసిన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. కె. సుబ్బరామ దాస్ దర్శకత్వంలో విజయలలిత ప్రధాన పాత్రలో నటించిన ‘రౌడీ రాణి’ (1970) చిత్రాన్ని హిందీలో కె. సుబ్బరామ దాస్ దర్శకత్వంలో విజయలలిత, ప్రేమ్ నాథ్, అజిత్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, అన్షు, శ్వేత అగర్వాల్ నటించిన ‘రాఘవేంద్ర’ (2003) సినిమా హిందీలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో జాయేద్ ఖాన్, ఇషా శర్వానీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ, అనుష్క శెట్టి, బ్రహ్మానందం నటించిన ‘విక్రమార్కుడు’ (2006) చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, నాసర్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మార్చి 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 80 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మార్చి 24 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 78 జవాబులు:

1.సింబా (2018) 2. సన్‍డే (2008) 3. స్వర్గ్ సే సుందర్ (1986) 4. వాంటెడ్ (2009) 5. వక్త్ కీ ఆవాజ్ (1988) 6. విజేత (1996) 7. యాద్ రఖేగీ దునియా (1992) 8. ఏ దిల్ (2003) 9. యంగిస్తాన్ (2014) 10. మేరా సాథీ (1985)

సినిమా క్విజ్ 78 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version