Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-86

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. టి.ఆర్. సుందరం దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, వైజయంతిమాల నటించిన ‘బాగ్దాద్ తిరుడన్’ (1960) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. ఆర్. నాగేంద్ర రావు దర్శకత్వంలో ఎస్. ఎస్. వాసన్ నిర్మించిన ‘మూండ్రు పిల్లయిగళ్ ‘ (1952) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (ఇందులో జెమినీ గణేశన్, కన్నాంబ, ఎం.కె.రాధ, శ్రీరామ్‍లు నటించారు. చిత్రం అట్టర్ ‍ఫ్లాప్ అవ్వగానే నిర్మాత, ఎస్. ఎస్. వాసన్ యీ చిత్రం ప్రింట్లను అన్నింటినీ తగులు చెట్టించారు.)
  3. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్, శరణ్య, నాసర్‌లు నటించిన ‘నాయకన్’ (1987) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (తెలుగులోనూ హిట్ అయిన చిత్రమిది)
  4. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ కాంత్, కమల్ హాసన్, శ్రీప్రియ నటించిన ‘ఆడు పులి అట్టం’ (1978) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. ఎ. భీమ్‍సింగ్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, దేవిక, సావిత్రి, జెమినీ గణేశన్‌లు నటించిన చిత్రం “పావ మన్నిప్పు’ (1961) చిత్రం. తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (ఈ చిత్రాన్ని డైరెక్టుగా ‘ఒకే కుటుంబం’ పేరుతో NTR, కాంతారావు, లక్ష్మి, రాజశ్రీ లతో తీసారు)
  6. ఎం.జి. రామచంద్రన్, అంజలీదేవి, పద్మిని గార్లతో దర్శకుడు ఎం. నటేశన్ తీసిన ‘మన్నాడి మన్నన్’ (1960) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  7. ఎస్. ఎస్. వాసన్ దర్శకత్వంలో, సి.రామచంద్ర స్వరాలందించగా, జెమినీ గణేశన్, పద్మిని, వైజయంతి మాల నటించిన ‘వంజికొట్టై వాలిబన్’ (1958) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  8. బాల దర్శకత్వంలో సూర్య, విక్రమ్, లైలా, సంగీతలు నటించిన ‘పితామగన్’ (2003) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (ఇది హిట్టయింది)
  9. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద, గీతలతో తీసిన ‘నినైతలె ఇనుక్కుమ’ (1979) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. సూరజ్ బర్‍జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ, రీమా లాగు నటించిన ‘మైనే ప్యార్ కియా’ (1989) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఏప్రిల్ 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 86 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మే 05 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 84 జవాబులు:

1.వేగుచుక్క 2. కొండవీటి దొంగ 3. అలీబాబా 4. ప్రేమలేఖలు (1953) 5. కోటీశ్వరుడు (1970) 6. భూలోక రంభ 7. ఎర్రగులాబీలు 8. రాజపుత్రి రగస్యము 9. మురిపించే మువ్వలు 10. వానంగా ముడి (1957)

సినిమా క్విజ్ 84 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version