సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.
***
వైవిధ్యాలతో కూడిన భారతీయ సమాజం లోని ఒక భాగంతో ప్రత్యక్ష పరిచయం! ఇప్పుడిటువంటి వాతావరణం చూడగలమా అంటే సందేహమే!
భారతీయ సామాన్య జనజీవనంలో హిందూ ముస్లిం సఖ్యత, ముఖ్యంగా కబ్రిస్తాన్ చుట్టూ తిరిగే కుటుంబాలు, షెహ్నాయ్ కళాకారుల జీవితాలు, వాటితో అల్లుకు పోయిన హిందూ బాంధవ్యాలు, వీటి మధ్య మధురమైన సంగీత రసధునులు – వెరసి ‘దాతా పీర్’ నవల.
రాజకీయాలకు దూరంగా, కేవల మానవీయ విలువల ప్రాధాన్యత అడుగడుగునా అల్లుకుపోయిన కథాంశం.
ప్రేమ లేలేత స్పర్శ, ఎదుటి వ్యక్తులకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలనుకునే కాపట్యపు ఆలోచనలకు అనుకోని ఎదురుదెబ్బలు, పీర్, ఫకీర్ల జీవన శైలి, యీ మలుపుల్లో పాఠకులను తిప్పుతూ, అలసట తోచని విధంగా మీర్, గాలిబ్ పంక్తుల కవితా గంధాన్ని మనసులకు అలదే నవల.
రాగానురాగాల కలయికగా సాగే జీవితాన్ని చివరికి ఒక మానవీయ స్పర్శే అర్థవంతం చేస్తుందన్న సందేశాన్నిస్తుందీ యీ నవల.
~
వచ్చే వారం నుంచే –
మీ అభిమాన ‘సంచిక’లో డా. శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని అనువదించిన ధారావాహికం
‘దాతా పీర్’.
చదవండి. చదివించండి.