Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దంతవైద్య లహరి-30

[దంత సంరక్షణ కోసం డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

నోరు ఎండిపోతే (డ్రై మౌత్):

ప్ర: డాక్టర్ గారు నా వయసు 70+. నా నోరు ఎండిపోతుండడం నా సమస్య. దీనివల్ల దంతాలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? దయచేసి వివరంగా తెలియజేయగలరు.

వీరభద్రం. బి, కుబ్దిగూడ, హైదరాబాద్.

జ: నోరు ఎండిపోవడానికి వృద్ధాప్యం ఒక ప్రధాన సమస్య అయితే, వయసుతో సంబంధం లేకుండా అనేక కారణాల మూలంగా నోరు ఎండిపోయే అవకాశం ఉంది.

ఇలా నోరు ఎండిపోవడాన్ని శాస్త్రీయంగా ‘జీరో స్టోమియా’ (డ్రై మౌత్) అంటారు. నోరు నిత్యం తడిగా వుండి, నమిలిన ఆహార పదార్థాలు సులభంగా లోపలికి పోయి సజావుగా జీర్ణం కావడానికి, నోటిలో సహజంగా వూరే ద్రవం వల్ల సాధ్యం అవుతుంది.

దీనినే ‘లాలాజలం’ (సెలైవా) అంటారు. ఇక్కడ లాలాజలం ‘సహజ లూబ్రికెంట్’ (కందెన) గా పని చేస్తుంది. ఇలా లాలాజలం నోటిలో స్రవించడానికి లాలాజల గ్రంథులు ఉంటాయి.

ఆహరం నమిలేటప్పుడు దౌడ కదలికల మూలంగా లాలాజల గ్రంథులు ప్రేరేపింపబడి లాలాజలం స్రవింపబడుతుంది. అలాగే ఇష్టమైన ఆహార పదార్థాలను చూసినప్పుడు, మెదడు సూచనల మేరకు నోటిలో లాలాజలం ఊరుతుంది. పుష్కలంగా లాలాజలం ఊరడం వల్ల, నమిలిన ఆహారం సులభంగా మ్రింగడానికి వీలు కలుగుతుంది. తర్వాత ఆహారం క్షుణ్ణంగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే, చెవికి సమాంతరంగా బుగ్గ ప్రాంతంలో ఇరువైపులా రెండు పెద్ద లాలాజల గ్రంథులు ఉంటాయి. వీటిని పేరోటిడ్ గ్రంథులు అంటారు.

వయసు పెరిగిన తర్వాత ఈ లాలాజల గ్రంథులు కుంచించుకుపోయే అవకాశం వుంది. ఈ పరిస్థితిలో లాలాజల గ్రంధుల ప్రధాన వాహికలు కుంచించుకునిపోయి లాలాజలం బహు తక్కువగా స్రవిస్తుంది. అలాంటప్పుడే నోరు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలా అని వయసుపైబడిన వారందరికీ ఇలా అవుతుందనే నియమం ఏమీలేదు. కానీ ఎక్కువ శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది.

నోరు ఎండిపోవడానికి ఇది ప్రధాన కారణం అయితే, దీనికి మరిన్ని కారణాలు వున్నాయి. అవి ఏమిటంటే..

1) డీహైడ్రేషన్:

అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం. దీనికి అనేక కారణాలు వున్నాయి.

2) ఆరోగ్యపరమైన సమస్యలు:

3) ఇతర కారణాలు:

నోరు ఎండిపోవడం మూలంగా వచ్చే సమస్యలు:

దంతాలకు సంబంచించి, పళ్ళు చిట్లిపోవడం, పంటి రంధ్రాలు ఏర్పడడం, ఆహరం మ్రింగలేని పరిస్థితి ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

చికిత్స:

నోరు ఎండిపోవడం గమనించిన వెంటనే, వైద్యుని/దంతవైద్యుని, సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలి. లేకుంటే దీనికి అదనంగా మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుంది. నోరు ఎండిపోవడాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. అది సహజమేలే.. అని అశ్రద్ధ చేయకూడదు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version