[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘దేని పని దానిదే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పువ్వు రాలిపోతుందని
గాలి వీచనంటుందా
కట్టె కాలిపోతుందని
నిప్పు కాల్చనంటుందా
పొద్దు వాలిపోతుందని
రేయి రాక ఉంటుందా
బువ్వ చెడిపోతుందని
పాచి చేరక ఉంటుందా
గిన్నె నల్లనై పోతుందని
మసి అంటక ఉంటుందా
దేని పని దానికే ఉంది
మన కోసం ఏదీ ఆగదు
