Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేశభక్తి గేయం

ఈ ‘దేశభక్తి గేయం’తో భరతమాతకి వందనాలు అర్పిస్తున్నారు మట్ట వాసుదేవమ్.

యభారత జనయిత్రీ వందనం!
జయ జయ జయ దివ్య ధాత్రీ వందనం!!

గంగ యమున గోదావరి ప్రవహించిన పుణ్య భూమి
మహానది, నర్మద, కావేరీలకు పుట్టినిల్లు
మహోన్నత హిమాలయములు కిరీటముగా ధరించు మాత!
వింధ్యాచలమే మలనూలై అలరారు వనిత                                       జయ ॥

శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు నీదు బిడ్డలై వెలసిరి!
లోకాలకు ధర్మబద్దమైన దారి చూపించిరి!!
గౌతముడు మహావీరుడు నీదు బిడ్డలే కదమ్మా!
అహింసయే పరమ ధర్మమనుచు భువిని ప్రవచించిరి!!               జయ ॥

కాళిదాసు వాల్మీకి కవిశ్రేష్ఠులై వెలసిరి!!
నీదు దివ్య వర్ణనలను నిలువుటద్దమున చూపిరి
ఆతుకూరి మొల్ల రంగాజమ్మలు తమ రచనలందు!
నవరసాలనద్ది నీకు నవతేజము కల్పించిరి!!                          జయ ॥

రాణాప్రతాప్ ఛత్రపతి రణధీరులు నీ బిడ్డలు
నీ దాస్య శృంఖలము తెంప కడవరకు పోరినారు
రాణి రుద్రమ ఝాన్సీ రాజసంపు నీ దుహితలు
విరోధులను మట్టి కుడిపి వీర జ్యోతులై వెలిగిరి                        జయ ॥

Exit mobile version