[శ్రీమతి రమాదేవి వాడాడ గారు రచించిన ‘ధర్మ బాట’ అనే కవితని అందిస్తున్నాము.]
బాట తప్పిన వాడికతి చేరువేల,
మతిలేని వానితో మంతన లేల,
నల్ల ధనంబు కొల్లలేల,
ధర్మంబుగా ఒక్క రూక చాలు.
ధర్మమే చూపేను ధరణిలో బాట,
ఇదియే కాదా నిక్కంబు శ్రీభారతి.
శ్రీమతి రమాదేవి వాడాడ గారు (జననం: 09 మే 1956) శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవయిత్రి. నీతి పద్యాలు, భక్తి పద్యాలు, ప్రకృతి మరియు కుటుంబ భావాలను ప్రతిబింబించే కవితలు, గేయాలు రచించారు. 2019లో కొల్లిపర లోగిలి సాహితీ వేదిక నిర్వహించిన “సిక్కోలులో సిరామృతం” జాతీయ కవి సమ్మేళనంలో సత్కరించబడ్డారు.
