[కీత్ విట్లీ పాడిన ‘డోంట్ క్లోజ్ యువర్ ఐస్’ అనే పాటను విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కీత్ విట్లీ – డోంట్ క్లోజ్ యువర్ ఐస్
- ఆల్బమ్ – డోంట్ క్లోజ్ యువర్ ఐస్ (1988)
- రచన – బాబ్ మెక్డిల్
~
జీవితంలో పైకి చెప్పుకోలేని కొన్ని దుఃఖాలు ఉంటాయి. జీవితంలో సర్దుబాట్లు అవసరమే కాని అవి మనసును ఎంతో రంపపు కోతకు గురి చేస్తాయి. ఈ సర్దుబాట్లు చేస్తున్న వ్యక్తితో పాటు వాటిని భరించే వ్యక్తులనూ అవి బాధకు గురి చేస్తాయి. ముఖ్యంగా వాళ్లు మనసున్న వ్యక్తులయితే. ఒక స్త్రీ ఒకరిని ప్రేమించింది. కాని ఏ కారణంతోనే వాళ్లు కలవలేకపోయారు. ఆమె మరొకరి సొంతం అయింది. అతనితో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అతనికి ఆమె అంటే ఎంతో ప్రేమ. ఆ ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కాని అతనికి తెలుసు ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటున్న ప్రతిసారి ఆమె కళ్ళు మూసుకుంటుందని. అతనికి తనను తాను సమర్పించుకుంటూనే, అన్ని రకాలుగా అతనికి సహకరిస్తూనే ఆమెలో ఓ బాధ, మౌనం. ఆమె మనసులో ఆ మొదటి ప్రేమను పూర్తిగా తుడిచివేయలేకపోతుంది. అతన్ని ఆమె గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతుంది. సాధారణంగా ఇది ఆ రెండవ వ్యక్తికి ఎంతో కోపాన్ని తెప్పించాలి. కాని అతను చాలా మంచివాడు. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నవాడు. ఆమెపై అతనికి ఎంతో గౌరవం కూడా ఉంది. ఆమె తన గతాన్ని మర్చిపోవడానికి తానేం చేయాలో ఆలోచిస్తూ ఆమెను ఒక్క సారి మనసు తలుపులు తెరిచి, గతాన్ని గడిచిన జీవితాన్ని మర్చిపొమ్మని, తన చేతుల్లో ఆమె ఉన్నప్పుడు ఆ క్షణం కేవలం తననే తలపుల్లో నింపుకొమ్మని, ఆ తరువాత తాను అందించే ప్రేమ అన్నిటిని మరపిస్తుందని అభ్యర్ధిస్తున్నాడు. ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం అనిపిస్తుంది ఈ పాట వింటూ ఉంటే. దీన్ని కిత్ విట్లి అద్భుతంగా గానం చేశాడు. అతని గొంతులో బాధ, ప్రేమ, దుఃఖం కలగలిసి వినిపిస్తాయి. అతని అభ్యర్థనలో ఆమెపై అతనికున్న ప్రేమ వ్యక్తమవుతూ మనసు ద్రవిస్తుంది. వారి ఏకాంత ప్రణయంలో అతని మనసు అనుభవించే బాధను ఎంతో సున్నితంగానో చెప్తూ ఆమెపై తనకున్న ప్రేమను కోరికను ప్రకటిస్తాడు కేత్. ఈ పాటలో ఆయన పలికించే ఆ దుఃఖం మనల్ని వెంటాడుతుండి. ప్రేమలోని గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
I know you loved him
A long time ago
Even now in my arms
You still want him, I know
(నువ్వు చాలా కాలం క్రితం అతన్ని ప్రేమించావని నాకు తెలుసు. ఇప్పుడు నా కౌగిలిలో కూడా నువ్వు అతన్నే కోరుకుంటూన్నావనీ నాకు తెలుసు)
ఈ పాట ప్రారంభంలోనే వారి బంధంలోని విషాదాన్ని వినిపిస్తాడు కేత్. కాని ఆమెపై అతనికున్న ప్రేమ కూడా ఈ వాక్యాల నడుమ మనకు అర్థం అవుతూనే ఉంటుంది.
But darling this time
Let your memories die
When you hold me tonight
Don’t close your eyes
Don’t close your eyes
(కాని ప్రియా ఈ సారి మాత్రం నీ జ్ఞాపకాలను మరణించనివ్వు. ఈ రాత్రి నా కౌగిలిలో ఒదిగినప్పుడు కళ్లు మాత్రం మూసుకోకు)
Let it be me
Don’t pretend it’s him
In some fantasy
Darling, just once let yesterday go
And you’ll find more love
Than you’ve ever known
Just hold me tight
When you love me tonight
And don’t close your eyes
(నీ కనులు మూయకు అవి తెరిచే ఉండనివ్వు. నేను అతననే భావంలో నటించకు, కాల్పనిక ప్రపంచంలో విహరించకు. పియా ఒక్కసారి ఆ నిన్నను వదిలేసేయి. నీవెప్పుడు ఎరుగనంతటి ప్రేమను ఇంకా ఎక్కువగా పొందుతావు. నన్ను కేవలం గట్టిగా హత్తుకో, అన్ను ప్రేమిస్తున్నప్పుడు ఈ రాత్రి నీ కళ్లు మూసుకోకు)
అతను ఆమెను దగ్గరకు తీసుకున్న ప్రతిసారి ఆమె తన పాత ప్రేమికుడిని గుర్తు చేసుకుంటూ నలిగిపోతుంది. బాధపడుతుంది. అతనితో ఊహా ప్రపంచంలో విహరిస్తుంది. ఆమె కూడా అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది మరి. అందుకే ఆ ప్రేమ ఆమెను అంతలా బాధిస్తుంది. అండులోనుండి బైటకు రావడం ఆమెకు చేతకావట్లేదు. అందుకే ఇతను ఆమెకు సహాయపడాలనుకుంటున్నాడు. మనసు నిండా ఆమెపై ప్రేమ ఉన్నా, తనతో ఉంటూ తనదగ్గర మానసికంగా లేకపోయిన ఈ ప్రియురాలికి మరోసారి ప్రేమామృతాన్ని అందించాలని తపన పడుతున్నాడు. ఇంతకు ముందు ఆమె అనుభవించిన ప్రేమకు మించిన ప్రేమ తాను పంచగలనని, ఆమె కేవలం తనను ఆ దృష్టితో చూస్తే చాలని, ఆ కొద్ది క్షణాలయినా తన గతాన్ని పక్కన పెడితే తాను ఆమెను సొంతం చేసుకోగలనని ఆతని నమ్మకం. అందుకే ఆమెను అభ్యర్ధిస్తున్నాడు.
Maybe I’ve been a fool
Holding on all this time
Lyin’ here in your arms
Knowing he’s in your mind
But I keep hoping some day
That you’ll see the light
Let it be me tonight
Don’t close your eyes
(నేను వెర్రివాడినే కావచ్చు, ఇంతకాలమూ ఇదంతా సహిస్తూనే నీ చేతుల్లో నిదురిస్తున్నాను, అతను నీ తలపుల్లో ఉన్నాడని తెలిసినా, ఏదో ఓ రోజు నువ్వు ఈ వెలుగును చూస్తావన్న ఆశతో ఉండిపోయాను. ఈ రాత్రి నీవాడిగా నన్ను ఉండనివ్వు. నీ కనులు మూసుకోకు)
Don’t close your eyes
Let it be me
Don’t pretend it’s him
In some fantasy
Darling, just once let yesterday go
And you’ll find more love
Than you’ve ever known
Just hold me tight
When you love me tonight
And don’t close your eyes
Just hold me tight
When you love me tonight
And don’t close your eyes
(ఆ కళ్ళు తెరచే ఉంచు. నన్నే నీ మనసులో నిలుపుకో. అతను నీ పక్కన ఉన్నడనే తలంపుతో నటించకు. ప్రియా నీ నిన్నను మర్చిపో. ఎల్లలు లేని ప్రేమ నీ సొంతం అవుతుండి. నన్ను ఈ రాత్రి ప్రేమతో గట్టిగా హత్తుకుంటున్నపుడు దయచేసి నీ కళ్ళు మూసుకోకు)
మరొకరిని ప్రేమించిన స్త్రీని అంతకన్నా ఎక్కువ ప్రేమించడానికి చాలా శక్తి కావాలి. ఆమె అతన్ని ప్రేమిస్తుందని తెలిసినా, తన దగ్గరగా ఉంటూ అతన్నే తలపుల్లో నింపుకుందని తెలుస్తూనే ఉన్నా, ఆమెను ప్రేమతో జయించాలనుకునే అతని ఓపికకు, నమ్మకానికి, నిజాయితీకి ఆ పాట పాడుతున్న వ్యక్తిలో అద్భుతమైన వ్యక్తిత్వం, ప్రేమ కనిపిస్తాయి. ఈ పాట కీత్ ను ఎందరో మహిళా అభిమానులను సంపాదించి పెట్టింది.
~
ఈ పాటని యూట్యూబ్లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/5rF_jr4RGe0?si=ehsdQoO6afPho17j )

