Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. నాగసూరి వేణుగోపాల్ సైన్స్ రచనలపై సదస్సు – ప్రకటన

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం- జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో – డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సైన్స్ రచనలపై ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సదస్సు నిర్వహించనున్నారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య డివిఆర్ మూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొనే ఈ సదస్సులో –

అత్యున్నత కళారూపం సైన్స్, ఆధునికతకు చిరునామా సైన్స్, ప్రకృతి – వికృతి & ప్రకృతి – పర్యావరణం, భారతదేశ తొలి వనితా వైద్యులు, జ్యోతిష్మతి, సైన్స్ క్యాలెండర్, సైన్స్ వైతాళికులు, సైన్స్ ధ్రువతారలు తదితర పుస్తకాలపై సమాలోచన ఉంటుంది.

పలువురు విశ్లేషకులు ఈ పుస్తకాలపై ప్రసంగిస్తారు.

డాక్టర్ ఎన్. రవికుమార్, డైరెక్టర్, జానుడి 9848187416.

Exit mobile version