సమాజంలో చెడును పరిహరించడం, మంచిని పెంచడం లక్ష్యంగా ఓ కవితల పోటీ నిర్వహించాలని వాసా ఫౌండేషన్ – పాలపిట్ట సంకల్పించాయి. డాక్టర్ వాసా ప్రభావతి స్మారకార్థం నిర్వహించే ఈ కవితల పోటీకి కవితలు పంపవలసిందిగా కవులను కోరుతున్నాము. చక్కని అభివ్యక్తి ఉన్న కవితలకు పోటీలో ప్రాధాన్యం ఉంటుంది.
- మొదటి బహుమతి: రూ. 3000/-
- రెండో బహుమతి: రూ. 2000/-
- మూడో బహుమతి: రూ. 1000/-
- ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు – ఒక్కొక్క కవితకి రూ. 500/-
~
పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండ కూడదు. సోషల్మీడియాలో పోస్టు చేసి వుండకూడదు. పూర్తిగా కొత్త కవితలయి ఉండాలి.
కవితలు పంపించవలసిన చిరునామా:
ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం: 3, బ్లాక్-6, ఏపిహెచ్బి
బాగ్లింగంపల్లి, హైదరాబాద్-500044
సెల్: 9848787284
కవితలు పంపడానికి చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026
ఫలితాలు ప్రకటించే తేదీ: 20 మే 2026
email: palapittamag@gmail.com

