Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. వి. ఆర్. రాసాని మూడు పుస్తకాల పరిచయ సభ – వార్త

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం; విద్యార్థి సంక్షేమం మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధ కథా, నవల, నాటక రచయిత కళారత్న డా॥ వి. ఆర్. రాసాని ఈమధ్య రాసిన మూడు పుస్తకాల పరిచయ సభ 28-02-2026న యూనివర్శిటీలోని సెనేట్ హాలులో ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సభకు ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారు.

ఈ కార్యక్రమం డి.ఎస్. డబ్ల్యూ డైరెక్టర్ ఆచార్య బి.వి. మురళీధర్, సాంస్కృతిక శాఖ సమన్వయకర్త డా॥ పి. వివేక్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు డా. వివేక్ తెలియజేశారు.

డా. రాసాని రచనల ఆవిష్కరణ మరియు పరిచయ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నరసింగరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. భూపతినాయుడు పాల్గొంటారు.

డా॥ రాసాని ముద్రించిన రూపకాల బృహద్గ్రంథం ‘సీమ యవనిక’ లోని శ్రవ్యరూపకాల గురించి ఆకుల మల్లేశ్వరరావు, దృశ్యరూపకాల పైన ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి, యాచక, గిరిజన, సంచార తెగల కథల సంపుటి ‘నాలుగో నాటకం’ పైన డా:ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు, మాండలిక కథల సంపుటి ‘మావూరి కతలు’ పైన డా॥ కొత్వాలు అమరేంద్ర ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ప్రసిద్ధ పుస్తక ప్రచురణ బాలా బుక్ పబ్లిషర్స్ ఎం. బి. ప్రత్యూషగారి అధ్వర్యంలో పుస్తక ప్రదర్శన వుంటుంది.

Exit mobile version