Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘స్వర్ణముఖి’ కథలు పుస్తకావిష్కరణ సభ – వార్త

తిరుపతి జిల్లా నాయుడు పేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వి.ఆర్.రాసాని ‘స్వర్ణముఖి’ కథలు పుస్తకావిష్కరణ సభ 17-8-2026 న జరిగింది.

మానవీకరించబడిన స్వర్ణముఖి నది గరుడపక్షితో తన పరీవాహ ప్రాంత ప్రజల కష్టాలను కథల రూపంలో చెప్పుకోవడం గొప్ప శిల్పంతో నడిపిన గొప్ప కథలు స్వర్ణముఖి కధలు అని వక్తలు కొనియాడారు.

ఈ సభకు, ప్రపంచ కవిగా పేరుగాంచిన డా:పెరుగు రామకృష్ణ గారు అధ్యక్షత  వహించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డా. గంగిసెట్టి శివకుమార్ గారు సమీక్ష చేశారు.

కవి, విమర్శకులు డా. కొత్వాలు అమరేంద్ర, జర్నలిస్టుల కవి గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, పత్రికా రచయిత్రి, హోమియో డాక్టర్ కె. ఉమాదేవి, కాలేజీ అధ్యాపకులు డా. హరినాథ్  ప్రసంగించారు.

అంతేగాక ఇంత మంచి పుస్తకాన్నిముద్రించిన బాలా బుక్ ప్రచురణను వక్తలు ప్రత్యేకంగా పొగిడారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రసన్న లత గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. డా. పురుషోత్తం వందన సమర్పణ చేశారు.

Exit mobile version