నీ కళ్ళల్లోకి చూసాను
ప్రేమించడం మొదలు పెట్టాను.
అందమైన కన్నులు
గులాబీ చెక్కిళ్ళు
వంపులు తిరిగిన పెదవులు
సన్నని చిరునవ్వు
నిజంగా అపుడే మొదలుపెట్టా ప్రేమించడం..
నన్ను నేను మొదటిసారిగా.!
తోడేటి సునీలా దేవి గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. జన్మస్థలం విజయవాడ. సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులైనారు.