Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏదీ ఆ బాల్యం

[వాణి వేమవరపు గారు రచించిన ‘ఏదీ ఆ బాల్యం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ఏదీ ఆ బాల్యం,
అది ఎచట చేరి నిలిచిందో,
మధువును చిందించుచూ,
మరి ఏ పసి కుసుమాల కడ నిలిచిందో.

ఎందరి బ్రతుకున మెరిసిందో,
మరి ఎందరికి మోపుగా మారిందో,
ఎందరిన గాడి తప్పి ఉప్పనైపోయిందో.
బందీగా కొందరిన పంజరానా చిలుకై నిలిచిందో.

ఆటల, పాటల, చిందుల బాల్యం,
మదిపై కురిసిన అమృత జల్లులా,
మనసును గారడి చేసి,
ఘడియలు వెనకకు తిప్పును హరివిల్లులా.

ఆశగా మెరిసిన ఆ బాల్యం
అలవోకగా దూరము జరిగినది.
మెరుపుగా మెరిసిన ఆ వైనం,
బాటగా, వెలుగుగా నిలిచిన ఓ కథనం.

ముదిమి వయసున ఆ బాల్యం,
మానసమందున ఆ ఆనవాళ్లు అమూల్యం.
మదిగది తలుపులు తడుతూ,
నిరతము ఆ ఊసులు పలికే ఆహ్వానం.

Exit mobile version