‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి జోతలు.
పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలను అందించాలని ‘సంచిక’ సదా కృషి చేస్తోంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక’ పద్యకావ్యాలు, వచనకవితల పోటీ ప్రకటించింది. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు నిర్వహిస్తున్నారు.
‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర.
కవుల కోరిక మేరకు ఈ రెండు పోటీల గడువు తేదీని 28 ఫిబ్రవరి 2025 కి పొడిగించడమైనది. వివరాలు ఈ లింక్‍లలో.
https://sanchika.com/2025-ugadi-padayakavya-potee-prakatana-update-1/
https://sanchika.com/2025-ugadi-vachana-kavitala-potee-prakatana-update-1/
‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలవుతున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ప్రముఖ సినీ గీత రచయిత ఆనంద్ బక్షి కుమారుడు రాకేష్ బక్షి ఇటీవల మహాకుంభమేళా ఉత్సవంలో పాల్గొని తన అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకున్నారు. ఆయన వ్రాసిన ఆంగ్ల వ్యాసాన్నీ, దానికి అనువాదాన్ని అందిస్తున్నాము.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఫిబ్రవరి 2025 సంచిక.
1 ఫిబ్రవరి 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
సంభాషణం
- విశ్వర్షి, అక్షరయోగి డా. వాసిలి వసంతకుమార్ అంతరంగ ఆవిష్కరణ – డా. ప్రసాద్ కె. ఎల్. వి.
ముఖాముఖి:
- సాహితీవేత్త, చిత్రకారుడు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారితో ముఖాముఖి – సంచిక టీమ్
ధారావాహిక:
- ఆరోహణ-7 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-18 – కుంతి
- సంచిక విశ్వవేదిక – కృత్రిమ మేధ, మూలాలు, పర్యవసానాలు – సారధి మోటమఱ్ఱి
- వందే గురు పరంపరామ్ – 6 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-10 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- ఫిబ్రవరి 2025 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 59 – ఆర్. లక్ష్మి
కథలు:
- 249 వెడ్స్ 210 – రాజేష్ కుమార్ పొన్నాడ
- కరప్షన్ కింగ్.. – గంగాధర్ వడ్లమన్నాటి
- సంసారంలో సరిగమ! సన్యాసంలో మగరిస!! – యన్. వి. శాంతి రెడ్డి
- పంచ భౌతికం – మణి
- సైనికుడి లేఖ – డా. మధు చిత్తర్వు
కవితలు:
- అంతే అయ్యుంటుంది – శ్రీధర్ చౌడారపు
- నవలోకం – అన్నవరం దేవేందర్
- జనంలో కలిసిపోతాను – వారాల ఆనంద్
పుస్తకాలు:
- నిరసన స్వరాలూ, సంఘీభావ కవనాలూ – ‘పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
బాలసంచిక:
- ఉత్తమ వైద్యుడు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
భక్తి:
- మహా కుంభమేళా – నా అనుభవాలు – రాకేష్ ఆనంద్ బక్షి
English Section:
Spiritual:
- Maha Kumbh – My Experiences – Rakesh Anand Bakshi
Poems:
- The Beauty of Smiths – Dr. T. Radhakrishnamacharulu
- By the Window Side! – Samudrala Hariskrishna
~
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.