‘సంచిక’ పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించేందుకు ‘సంచిక’ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.
దీపావళి కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా పద్యకావ్యాలు, వచనకవితల పోటీ నిర్వహిస్తోంది ‘సంచిక’. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని నిర్వహిస్తున్నారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు. పద్య కావ్య రచన పోటీ వివరాలు ఈ లింక్లో చూడవచ్చు.
https://sanchika.com/2025-ugadi-padayakavya-potee-prakatana/
‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర. ఈ పోటీ వివరాలు ఈ లింక్లో చూడవచ్చు.
https://sanchika.com/2025-ugadi-vachana-kavitala-potee-prakatana/
విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా, ‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు నిలుస్తున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఈ రెండు పోటీలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ‘సంచిక’ వెబ్ పత్రికనూ చూస్తూండమని మనవి.
శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారి స్వీయచరిత్ర ఈ నెల మొదటివారంలో ముగుస్తోంది. దాని స్థానంలో మరో ప్రేరణాత్మక స్వీయకథని అందిస్తున్నాము. వివరాలు 05 జనవరి 2024, ఆదివారం సంచికలో.
అదే విధంగా ఈ నెల మొదటి వారంతో ముగుస్తున్న ‘అద్వైత్ ఇండియా’ అనే ధారావాహిక స్థానంలో మరో కొత్త ధారావాహిక ప్రారంభించబోతున్నాము. వివరాలు 05 జనవరి 2024, ఆదివారం సంచికలో.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జనవరి 2025 సంచిక.
1 జనవరి 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
సంభాషణం
- కథకులు, బాల సాహితీవేత్త డా. ఎం. హరికిషన్ అంతరంగ ఆవిష్కరణ – డా. ప్రసాద్ కె. ఎల్. వి.
ధారావాహిక:
- ఆరోహణ-6 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-17 – కుంతి
- సగటు మనిషి స్వగతం-8 – సగటు మనిషి
- వందే గురు పరంపరామ్ – 5 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-9 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- జనవరి 2025 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 58 – ఆర్. లక్ష్మి
కథలు:
- ప్రవాస చంద్రుడు – గంగాధర్ వడ్లమన్నాటి
- పంచరంగుల పాత కథ – యన్. వి. శాంతి రెడ్డి
- పదేళ్ళ పగ – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
కవితలు:
- నీ రాక.. నీ పోక – శ్రీధర్ చౌడారపు
- కామెంగ్! – డా. విజయ్ కోగంటి
- కొత్త కేలండర్ – డా. మైలవరపు లలితకుమారి
పుస్తకాలు:
- పఠనీయతా గుణం, శిల్ప వైవిధ్యం ఉన్న కథల సంపుటి ‘క్విల్ట్’ – పుస్తక విశ్లేషణ – అంపశయ్య నవీన్
బాలసంచిక:
- ఉత్తమ వైద్యుడు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
- మంత్రఫలితం – పి. రాజేంద్రప్రసాద్
అవీ ఇవీ
- ‘మేకల బండ’కు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు ప్రథమ నవలా పురస్కారం – ప్రెస్ నోట్- సంచిక టీమ్
English Section:
- 2025 New Year Wishes – Poem – Saradhi Motamarri
- Dreams? – Poem – Samudrala Hariskrishna
~
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.