Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం సెప్టెంబర్ 2024

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యావాదాలు.

విశిష్టమైన, విభిన్నమైన రచనలు పాఠకులకు అందించేందుకు ‘సంచిక’ నిరంతరం చేస్తున్న ప్రయత్నం కొనసాగుతోంది.

‘సంచిక లో ’ ప్రచురితమయ్యే  రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్నాయి.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకానికి కథలు పంపపల్సిన గడువు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024. ప్రకటన లింక్ ఇది.

అలాగే, డా. అమృతలత-సంచిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి కథలు పంపపల్సిన గడువు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024. ప్రకటన లింక్ ఇది. ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రచయితలను కోరుతున్నాము.

ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ‘సంచిక’ వెబ్ పత్రిక ప్రత్యేక సంచిక వెలువరించిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలోనే ఈ నెలలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించాలని ఆశిస్తూ, రచనలు కోరుతూ ఒక ప్రకటన ఇచ్చాము. ఈ స్పెషల్ ఇష్యూ కోసం రచనలను 03 సెప్టెంబరు 2024 నాటికల్లా పంపమని కోరాము. వినాయక చవితి 07 సెప్టెంబరు 2024, శనివారం నాడు వచ్చింది. స్పెషల్ ఇష్యూ 08 సెప్టెంబరు 2024 ఆదివారం నాడు వెలువడుతుంది.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – శ్రీమతి గంటి స్వాతి రచించిన కేరళ, తమిళనాడులోని కొన్ని దర్శనీయ స్థలాల యాత్రా రచనను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 సెప్టెంబర్ 2024 సంచిక.

1 సెప్టెంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

English Section:

~

ఈ నెల 1వ తేదీ, ఆదివారం ఒకే రోజు అయినందున, ఈ రోజు ‘సంచిక వారపత్రిక’ కూడా విడుదలవుతుంతోంది. వారపత్రికలో ఈ వారం నుంచి శ్రీమతి జి.ఎస్. లక్ష్మి గారి నవల ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ ప్రారంభవుతోంది. గత వారం శ్రీ జిల్లేళ్ల బాలాజీ గారి ‘జీవితమొక పయనం’ అనే నవల ధారావాహికగా ప్రారంభమైంది. వైవిధ్యవంతమైన కథావస్తువులతో ఈ ధారావాహికలు అలరించనున్నాయి.

1 సెప్టెంబర్ 2024 నాటి ‘సంచిక వారపత్రిక’లోని రచనలు:

సీరియల్స్:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

భక్తి:

 

ఆత్మకథ/స్వీయచరిత్ర:

కథలు:

పద్యకావ్యం:

కవితలు:

పుస్తకాలు:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version