[శ్రీ సాహితి రచించిన ‘ఏదో వెలితి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
రోజులు
కరిగిపోతుంటే
మనసు గడ్డకడుతుంది
వెనక్కి తిరిగి
చూసుకుంటే
ఏదో వెలితి వెక్కిరిస్తోంది.
అందుకే
నేను నా నుండి
బయటకు రాను
వస్తే
ఎన్నో ప్రశ్నలు
అందులో ఎక్కువ
జవాబు లేనివే..
అందుకే
నేను నాలోనే ఉంటాను
ఏ ప్రశ్నకు చిక్కకుండా
