Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏమో

రాత్రి చేసే ఓ ప్రయాణాన్ని, తనను అది తీసుకుపోతున్న వైనాన్ని “ఏమో” కవితలో వివరిస్తున్నారు ముకుంద రామారావు.

బహుశా నీటి పొరపాట్లు
మంచు ముత్యాలు

పూవు మీద మంచు బిందువులా
సముద్ర ఘోషల మధ్య
నిశ్సబ్ద దీవి

నిశ్శబ్దాన్ని చీకట్లను
పారద్రోలాలి కదా నిద్ర
నాలానే రాత్రీ మెలకువగానే ఉందేమో
రాత్రి ఎలా గడిచిందో పక్కలకు తెలుసు

చంద్రుడు నక్షత్రాలు
మేఘాలు పూలు
సముద్రాలు నదులు
దారిలోని సమస్తాల్నీ
దాటుకుంటూ పోతున్న రైలులా
రాత్రి పోతూనే ఉంది

ఏదో ఒకరాత్రి నన్నూ తీసుకుపోతుంది
ఎక్కడికో ఏమో

Exit mobile version