Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎమోజీల చక్రం

ది మానవుల ఎమోజీలు
కొండ గుహల్లోని గీతలు
అర్థాలు వెతుక్కున్నాం!
భాషలోకి మార్చుకున్నాం…
నాగరికతను పెంచుకున్నాం
అక్షరాలను సుసంపన్నం చేసుకున్నాం.

ఆధునిక మానవుల ఎమోజీలు
గూగుల్‌లో నిక్షిప్తం
చిహ్నాలను అక్షరాలలోకి మార్చిన మనం
మాటలను గుర్తుల్లో వెతుక్కుంటున్నాం
విచిత్రం – ఎమోజీల సైకిల్.

Exit mobile version