[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘ఎందుకంటే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కొన్ని పూలు
దండలో కంటే
విడివడిగా
ఉంటేనే మేలు
కొంతమంది
గుంపులో కంటే
ఎడబావుగా
ఉంటేనే మేలు
దండ సొబగు
చెడగొట్టడానికి
ఆ పూలు చాలు
గుంపు ఐక్యత
విడగొట్టడానికి
ఆ మంది చాలు

