Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ఎంత చేరువో అంత దూరము’ – కొత్త ధారావాహిక – ప్రకటన

శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

అంత దూరం నుండే గులాబీ రంగుపూలు పూసి, గేట్ పైకి ఎగబాకిన బఠాణి తీగతో ముచ్చట గొలుపుతున్న తమ ఆ చిన్న డాబా ఇల్లు ఆ క్షణం ఉత్సహం కలిగించలేదు జాహ్నవికి. నిర్వేదం నీడలు అలుముకున్నాయి.

ఇంతేనా! ఇంక తమ ఇల్లు మారదా!

ఇల్లంటే ఎలా ఉండాలి? విరిసిన పున్నాగ వనంలా, గల గల నవ్వుల జలపాతంలా.. జాహ్నవి మనోగతంలో ఇంటి గురించిన అందమైన స్కెచ్ ఉందేమో! ఆమె తలుపులలో నిరాశా మేఘాలు కమ్ముకున్నాయి.

అసలు తమ ఇంట్లో ఈ వెలితి ఎందుకు? ఈ స్తబ్దతను తొలగించే వారు ఎవరు? సమాధానం లేని ప్రశ్నతో కథాగమనంలో కదిలి పోతున్న పాత్రల సంఘర్షణనే ‘ఎంత చేరువో అంత దూరము’.

~

త్వరలో – అతి త్వరలో –

మీ అభిమాన ‘సంచిక’లో శారద పువ్వాడ (తడకమళ్ళ) రచించిన ధారావాహికం ‘ఎంత చేరువో అంత దూరము’.

Exit mobile version