[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘ఎంతో కొంత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ మిత్రమా!
కాస్త వింటావా నా గాథ
తెలుసుకుంటావా నా వ్యథ
చేస్తున్నాను నా వంతు
మీ కోసం ఎంతో కొంత
కానీ మీకు తెలియదు
ఆ కొంతే బోలెడంత
నా అనుభవమంత
లేదు మీ ప్రాయం
అందుకే పదే పదే చెపుతాను
మీ కలల కోసం ఎంతో కొంత
కానీ ఎన్నటికీ మీరు అర్థము
చేసుకోలేరు ఆ కొంత
ఇక పై చెప్పను మీకు ఆ కొంత
ఇక నేను చాలించుకుంటా
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
