[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘ఎప్పటికీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కష్టమెంతైన గాని
నడిచి వచ్చిన దారిని
మరచిపోలేను
మట్టి ముద్దనైన గాని
ప్రేమతో తెచ్చిన దానిని
వదులుకోలేను
గడ్డి పోచనైన గాని
ఇష్టంతో ఇచ్చిన దానిని
చేజార్చుకోలేను
ఎన్ని ఇక్కట్లైన గాని
పోరాడి మెచ్చిన దానిని
పోగొట్టుకోలేను
