Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎప్పటికీ అపరిచితుడవే

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఎప్పటికీ అపరిచితుడవే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ఎంతటి గొప్ప లక్ష్యం అయినా
జీవితం కంటే ఎపుడూ చిన్నదే
ఎంతగా డబ్బు సంపాదించినా
సంతృప్తి ముందు దిగదుడుపే
ఎంతటి సౌందర్యం చూసినా
మనసు అందం ముందు తక్కువే
పున్నమి వెన్నెల అయినా
అనురాగం ముందు తీసికట్టే
ఎంతగా ఊపిరి బిగబట్టినా
ఆఖరి శ్వాసతో పటాపంచలు
ఎంతటి గుర్తింపు పొందామనుకున్నా
నీవు నీకు ఎప్పటికీ అపరిచితుడవే

Exit mobile version