Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈశ్వర వరప్రసాద పరిషత్తు యువ పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం

సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈశ్వర వరప్రసాద పరిషత్తు, గుంటూరు వారు ఇచ్చే యువ పురస్కారం, 2025 సంవత్సరానికి గాను యువ కవి గూండ్ల వెంకటనారాయణ ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘ద్రావిడ మహాసముద్రం’ వచన కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది.

డిసెంబర్ 21, 2025 న గుంటూరు బ్రాడిపేటలోని కొరటాల మీటింగ్ హాల్ లో ఉదయం 10 గంటలకు పురస్కార ప్రదానం జరుగుతుంది.

కార్యక్రమానికి అధ్యక్షులుగా గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు కె.జె రమేష్, ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి, వాగ్గేయకారులు, కళారత్న గ్రహీత డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు పాల్గొంటారు.

ఈశ్వర్ వరప్రసాద పరిషత్తు కార్యదర్శి డాక్టర్ శెట్లం చంద్రమోహన్ గారు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

– ఎస్ ఎం సుభాని, నానా, శ్రీవశిష్ఠ

నిర్వాహకులు

Exit mobile version