[బాలబాలికల కోసం ‘బాక్టీరియాను చంపగలిగే బూజులను కనుగొన్న ఎర్నెస్ట్ డ్యూచెన్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ఎర్నెస్ట్ డ్యూచెన్ 1874వ సంవత్సరంలో మే నెల 30వ తేదీన జన్మించాడు. ఇతని భార్య రోజా లాసల్లాస్. డ్యూచెన్ బాక్టీరియాను చంపగలిగే బూజులను కనుగొన్నాడు. ఈయన చేసిన పరిశోధనల వలననే ఆ తర్వాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పరిశోధనలకు బీజం పడింది. డ్యూచెన్ పరిశోధనలు కావించిన 32 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుక్కోవటానికి కారణమైంది.
1894లో డ్యూచెన్ థీసిస్‌ను వెలువరించాడు. సూక్ష్మజీవుల పెరుగుదలనూ అవి కలిగించే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని సూక్ష్మజీవులు అంతమయ్యేందుకు కారణాలను కనుగొనాలని అనుకున్నాడు. బూజులలో సూక్ష్మజీవులు చనిపోవడాన్ని గుర్తించిన డ్యూచెన్ సిద్ధాంతం వలననే 1897లో డాక్టరేట్ అందుకున్నాడు. మొదటగా డ్యూచెన్ మిలిటరీ వెల్త్, సర్వీస్ స్కూలు ఆఫ్ లయోన్స్‌లో తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టాడు. టైఫాయిడ్ జ్వరాన్ని కలిగించే సాల్మోనెల్లా ఎంటరికా అనే బాక్టీరియాను నాశనం చేసేందుకు పెన్సిలిన్ గ్లాకమ్ అనే మీడియమ్‌ను ఉపయోగించి సత్పలితాలు పొందాడు. పలుసార్లు ప్రయోగాలు చేసిన మీదట డ్యూచెన్ తన పరిశోధనా ఫలితాల్ని ప్రచురించాడు. పెన్సిలిన్ గ్లాకమ్ బూజు జంతువులకు చికిత్స చేయగలదని అందులో వివరించాడు.
ఎర్నెస్ట్ డ్యూచెన్ ఒక ఫ్రెంచ్ వైద్యుడు. అతని సిద్ధాంత వ్యాసం, ‘సూక్ష్మజీవులలో జీవ పోటీ అధ్యయనానికి చేసిన కృషి: బూజులు మరియు సూక్ష్మజీవుల మధ్య వైరుధ్యం’ (1897), బూజుల యొక్క సూక్ష్మజీవనాశక చర్య వలన కలిగే చికిత్సా సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్న మొట్టమొదటి అధ్యయనం. డ్యూచెన్ బూజు యొక్క ద్రావణాన్ని తయారు చేసి, దానిని వ్యాధిగ్రస్థమైన గినియా పందుల శ్రేణిలోకి ఎక్కించడం ద్వారా తన పురోగతిని సాధించాడు; ఆ పందులన్నీ కోలుకున్నాయి. తరువాత అతను ఎస్చెరిచియా కోలి మరియు పెనిసిలియం గ్లాకమ్ మధ్య పరస్పర చర్యను అధ్యయనం చేశాడు. కేవలం ఈ రెండు జీవులు మాత్రమే ఉన్న కల్చర్‌లో, పెనిసిలియం గ్లాకమ్, ఎస్చెరిచియా కోలిని పూర్తిగా నిర్మూలించగలదని అతను చూపించాడు. అంతేకాకుండా, ఒక జంతువుకు సాధారణంగా ప్రాణాంతకమైన టైఫాయిడ్ బాసిల్లై మోతాదును ఇచ్చినప్పుడు, అదే జంతువుకు పెనిసిలియం గ్లాకమ్‌ను కూడా ఎక్కిస్తే, ఆ జంతువు వ్యాధి నుండి విముక్తి పొందుతుందని అతను నిరూపించాడు.
“1896లో, ఎర్నెస్ట్ డ్యూచెన్ ఆసక్తికరమైన ఆవిష్కరణలు చేశారు: బూజులో ఉంచినప్పుడు బ్యాక్టీరియా చాలా త్వరగా చనిపోయింది మరియు బ్యాక్టీరియాను ఎక్కించిన ఎలుకలకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అవి బ్రతికాయి. డ్యూచెన్ తన ఆవిష్కరణలను 1897 నాటి ఒక పత్రంలో నమోదు చేశారు, కానీ అతని వయస్సు తక్కువగా ఉండటం వలన, అతని నివేదికను ఇన్స్టిట్యూట్ పాశ్చర్ అంగీకరించలేదు మరియు దురదృష్టవశాత్తు, అతను తన పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లలేదు.” అని శాండ్రిన్ నౌవెల్ తెలిపారు.
ఇతర కృషి, పురస్కారాలు మరియు గౌరవాలు
పెన్సిలిన్‌ను కనుగొన్న ఘనత సాధారణంగా ఫ్లెమింగ్‌కు దక్కినప్పటికీ, వాస్తవానికి సాంకేతికంగా ఫ్లెమింగ్ ఆ పదార్థాన్ని తిరిగి కనుగొన్నారు.
1949లో డ్యూచెన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 1896 లోనే ఫ్రెంచి వైద్యవిద్యార్థి ఐన డ్యూచెన్ పెన్సిలిన్ యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని కనుగొన్నారు. అయినప్పటికీ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించలేదు. పెన్సిలిన్‌కు, ఫంగస్ పదార్థాలకు మధ్య సంబంధాన్ని పూర్తిగా వివరించలేక పోయారు. ఫ్లెమింగ్ వచ్చి పెన్సిలిన్‌ను కనుగొనే దాకా ఈ పరిశోధన అడుగున పడిపోయిది.
1912వ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన ఎర్నెస్ట్ డ్యూచెన్ మరణించాడు. డ్యూచెన్ మరణించే నాటికి అతని వయస్సు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. ఫ్రాన్స్ లోని పైరినిస్ ఓరియంటేషన్‌లో మరణించాడు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
