Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన జపనీస్ బాక్టీరియాలజిస్ట్ హిడెయో నోగుచి

[బాలబాలికల కోసం ‘అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన జపనీస్ బాక్టీరియాలజిస్ట్ హిడెయో నోగుచి’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

హిడెయో నోగుచి 1876వ సంవత్సరంలో నవంబర్ 9వ తేదీన జపాన్‌లోని పుకుషిమాలో జన్మించాడు. ఇతన్ని ‘సీసాకు నోగుచి’ అని కూడా పిలిచేవారు. నోగుచి తన శాస్త్రీయ పరిశోధనలకు గాను అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మొదటి జపనీస్ శాస్త్రవేత్త. 1913వ సం. నుండి 1927వ సం. మధ్యలో వైద్యరంగంలో అనేక సార్లు నోబెల్ బహుమతికై నామినేట్ చేయబడ్డాడు. 2004లో వెయ్యి యెన్ నోటుపై నోగుచి ఫోటో ముద్రించబడింది. మీడియా నోగుచి ఆఫ్రికా బహుమతిని ఆయన గౌరవార్థంగా ప్రదానం చేస్తారు.

బాల్యంలో నోగుచి ప్రమాదాల పాలయ్యాడు. ఇతని తల్లి షికా కుటుంబమంతా వ్యవసాయం చేస్తూ జీవించేవారు. నోగుచి ప్రాధమిక పాఠశాలలో చేరినప్పుడు, అతని ప్రతిభను ఉపాధ్యాయుడు గుర్తించాడు. నోగుచి వైద్యుడు కావాలని కోరుకున్నాడు. అతను యోకోవోమా ఓడరేవులో క్వారంటైన్ అధికారిగా పని చేసేవాడు. నోగుచి ఇంపీరియల్ విశ్వవిద్యాలయం నుండి వైద్యుడిగా పట్ట భద్రుడయ్యాడు. రాక్ ఫెల్లర్ యూనివర్శిటీలో పని చేయడం మొదలుపెట్టాడు. పక్షవాతం వచ్చిన మెదళ్ళలో వ్యాధికారక ఏజెంట్ ఉనికిని కలిగి ఉన్నదని నోగుచి అభిప్రాయపడ్డాడు.

హిడెయో నోగుచి అమెరికాలో నివసించిన ఒక ప్రముఖ జపనీస్ బాక్టీరియాలజిస్ట్. న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌లో సిఫిలిస్ వ్యాధికి కారణమయ్యే ట్రెపోనెమా పల్లిడమ్ అనే స్పైరోకీట్ బాక్టీరియాను ఆయన విజయవంతంగా కల్చర్ చేశాడు. దీనివల్ల, సిఫిలిస్ వ్యాధిని నిర్ధారించడానికి ఒక చర్మ పరీక్షను రూపొందించడం నోగుచికి సాధ్యమైంది. వ్యాధి ముదిరే కొద్దీ టి. పల్లిడమ్ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని కూడా ఆయన చూపించాడు. దక్షిణ మరియు మధ్య అమెరికాలో వ్యాపించిన ఒరోయా జ్వరంపై పరిశోధన చేసిన తరువాత, ఇసుక ఈగల ద్వారా మానవులకు సంక్రమించే బార్టోనెల్లా బాసిల్లిఫార్మిస్ అనే బాక్టీరియా వల్ల ఆ జ్వరం వస్తుందని ఆయన నిరూపించాడు.

“తన శారీరక వైకల్యాన్ని అధిగమించి, పాశ్చాత్యుల ఆధిపత్యం ఉన్న రంగంలో ఒక ఆసియా శాస్త్రవేత్తగా పేరు సంపాదించి, మానవ జ్ఞాన నిధిని వృద్ధి చేయడానికి నోగుచి చేసిన పోరాటం, జపాన్‌లో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్నికల్పించింది. ప్రస్తుతం అక్కడ వెయ్యి యెన్ల నోటుపై ఆయన ముఖచిత్రం ఉంది.” అని అన్నారు అత్సుషి కితా.

2008 ఇతర సేవలు, పురస్కారాలు మరియు గౌరవాలు నోగుచి జపనీస్ మరియు విదేశీ పురస్కారాలతో సత్కరించబడ్డాడు. ఆయన అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డిగ్రీలను అందుకున్నాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1915లో ఆయన స్వదేశంలో ‘ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆఫ్రికాలో వివిధ అంటువ్యాధులపై పోరాటంలో లేదా వినూత్న వైద్య సేవా వ్యవస్థలను స్థాపించడంలో విశేష విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించే పురస్కారంగా జపనీస్ ప్రభుత్వం జూలై 2006లో ‘హిడెయో నోగుచి ఆఫ్రికా ప్రైజ్’ను స్థాపించింది. నోగుచి బాక్టీరియాలజీ, సీరాలజీ, ఇమ్యూనాలజీ శాస్త్రాలలో కృషి చేశాడు. నోగుచి భార్య పేరు మేరీ లోరెట్టా డార్టిస్. 1912లో వీరి వివాహం జరిగింది.

జపాన్ అకాడమీ యొక్క ఇంపీరియల్ ప్రైజును, ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బిరుదును నోగుచి పొందాడు. కోబర్ మెడల్ నోగూచిని వరించింది. ఆర్డర్ ఆఫ్ డాన్నెబ్రోగ్, లెజియన్ ఆఫ్ ఆనర్ బహుమతులను, గౌరవాలను నోగుచి పొందాడు. సిఫిలిస్, ట్రిపోనెమా పాలిడమ్, న్యూరో సిఫిలిస్ వంటి వ్యాధులపై అధిక కృషి సాగించాడు. 1928 మే నెల 21వ తేదీన గోల్డ్ కాస్ట్‌లోని ఆక్రాలో నోగుచి మరణించాడు.

Exit mobile version