Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లుల రక్షకుడని పేరు పొందిన ఇగ్నార్ సెమ్మెల్వీస్

[బాలబాలికల కోసం ‘తల్లుల రక్షకుడని పేరు పొందిన ఇగ్నార్ సెమ్మెల్వీస్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

గ్నార్ సెమ్మెల్విస్ 1818వ సంవత్సరంలో హంగేరీలో జన్మించాడు. ఆసుపత్రులలో ప్రసవానంతరం తల్లులకు వచ్చే జ్వరాన్ని నియంత్రించడానికి చేతులను శుభ్రపరచుకునే విధానాన్ని కనుగొన్నాడు. దీనివల్ల సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించవచ్చు. సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే అనేక జబ్బులను నివారించవచ్చు. వీరిని ‘సంక్రమణ నియంత్రణ పితామహుడు’ అని పిలుస్తారు. తల్లులకు వచ్చే ప్రసవానంతర జ్వరాన్ని రాకుండా నిరోధిస్తున్నందుకు గాను ‘తల్లుల రక్షకుడు’ అని పేరు పొందారు. వీటి వలన యాంటీ సెప్టిక్ వైద్య విధానాలు అమలయ్యాయి. సెమ్మెల్విస్ యాంటీ సెప్టిక్ వైద్య చరిత్రకు మార్గదర్శకులయ్యాడు.

ఇగ్నార్ సెమ్మెల్విస్ హంగేరి లోని బుడా లో పుట్టినప్పటికీ తండ్రి జర్మన్ వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతను తల్లిదండ్రుల పది మంది సంతానంలో ఐదవ వాడుగా జన్మించాడు. ఇగ్నార్ పరిశోధనలు అద్భుతంగా ఉన్నప్పటికీ ఆనాటి వైద్యులు, శాస్త్రవేత్తల అభిప్రాయలతో విభేదించడం వల్ల ప్రాచుర్యం పొందలేదు. ఇతని ఆలోచనలను వైద్య సమాజం తిరస్కరించింది. ప్రతి ఒక్కరూ క్లోరినేటెడ్ సున్నం ద్రావణంలో చేతులు శుభ్రపరుచుకోవాలని సూచించాడు. చివరి రోజుల్లో మానసిక ఆరోగ్యం చిక్కుల్లో పడింది. ప్రవర్తనా ధోరణి బాగాలేక మానసిక వైద్యశాలలో చేర్చారు. అనేక అనారోగ్యాలు చుట్టు ముట్టాయి.

హంగేరియన్ వైద్యుడైన ఇగ్నార్ సెమ్మెల్వీస్‌ను యాంటీసెప్టిక్ విధానాలకు మార్గదర్శకుడిగా పరిగణిస్తారు. క్లినిక్‌లోని విద్యార్థులకు (తరచుగా శవపరీక్ష గది నుండి వచ్చేవారు) బోధించే విభాగం కంటే, మంత్రసానుల విభాగంలో చాలా తక్కువ మంది మహిళలు మరణించడాన్ని సెమ్మెల్వీస్ గమనించాడు. విద్యార్థుల ద్వారానే సంక్రమణ వ్యాపిస్తుందని నిర్ధారించుకున్న ఆయన, ప్రతి పరీక్షకు ముందు వారి చేతులను క్లోరినేటెడ్ సున్నంతో కడుక్కోమని ఆదేశించారు. దాంతో మరణాల రేటు 18% నుండి 1%కి పడిపోయింది. శవపరీక్ష పనులకు మరియు రోగుల పరీక్షకు మధ్య చేతులు కడుక్కోవడానికి క్లోరినేటెడ్ సున్నం ద్రావణాన్ని (ఆధునిక కాల్షియం హైపోక్లోరైట్) ఉపయోగించాలనే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు.

“ఇగ్నాజ్ సెమ్మెల్వీస్ మరియు జాన్ స్నో నిర్వహించిన మొట్టమొదటి శాస్త్రీయ ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు, వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో మరియు సాధారణ చర్యల ద్వారా ఆ వ్యాప్తిని ఎలా అడ్డుకోవచ్చో సూచించడంలో కీలక పాత్ర పోషించాయి.” అని జెఫ్రీ సి. పోమర్‌విల్లే వ్యాఖ్యానించారు.

ఇతర రచనలు, అవార్డులు మరియు గౌరవాలు:

సెమ్మెల్వీస్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ‘ప్రసవ జ్వరం యొక్క కారణాలు, భావన మరియు నివారణ’ అనే గ్రంథంలో ప్రసవానంతర జ్వరంపై ఆయన కనుగొన్న విషయాలు, చేతులు కడుక్కోవడం వల్ల మరణాల రేటు 1% కంటే తక్కువకు తగ్గిందని వెల్లడించారు. వివిధ ప్రచురణలలో ఈ ఫలితాలు వెలువడినప్పటికీ, సెమ్మెల్వీస్ మరణించిన చాలా సంవత్సరాల తర్వాత, లూయిస్ పాశ్చర్ సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ధృవీకరించినప్పుడు మాత్రమే ఆయన పద్ధతికి విస్తృత ఆమోదం లభించింది.

ఈయన పరిశోధించిన సిద్ధాంతం జెర్మ్ సిద్ధాంతంగా కాక మత సిద్ధాంతంగా మారటం వలన శాస్త్రవేత్తల ఆమోదం పొందలేదు. ఇగ్నార్ సెమ్మెల్విస్ 1865 ఆగస్టు 13వ తేదిన మరణించాడు. ఆయన వయసు మరణించే నాటికి కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఇతనికి ఐదుగురు సంతానం. భార్య పేరు మారియా వీడన్ హోఫర్.

Exit mobile version