Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓషనోగ్రఫీలో విశిష్ట కృషి చేసిన మేరీ థార్ప్

[శ్రీమతి ఆర్. లక్ష్మి గారి ‘ఓషనోగ్రఫీలో విశిష్ట కృషి చేసిన మేరీ థార్ప్’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

1940లలో జియోలజీలో మగవాళ్లదే రాజ్యం. ల్యాబ్‌లలో ఆడవాళ్లు అరుదు. Field లో nil. మేరీ థార్ప్, ఓషనోగ్రాఫర్ బ్రూస్ హీజెన్ (Bruce Heezen) తో కలసి కొలంబియా యూనివర్శిటీలో పరిశోధనలు సాగించారు. ఇది ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ collaboration.

హీజెన్ – రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సబ్ మైరైన్స్‌ని కనిపెట్టడానికి వాడిన యుద్ధ టెక్నాలజీ – ‘సోనార్ శబ్ద తరంగాలను సముద్రపు అట్టడుగు తలానికి పంపి వెనక్కి రావడానికి పట్టే time ని కొలవడం’ని వినియోగించి అట్లాంటిక్‌ని దాటిన ఓడల నుండి నుండి సోనార్ data ను సేకరించారు.

శాస్త్రజ్ఞులకి సీబెడ్ కాంటూర్స్ గురించి ఆలోచన – పరిశోధనలకి వీలుగా అది ఉట్టి data మాత్రమే నంబర్స్ గ్రాఫ్స్! మేరీ థార్ప్‌ది ఆ డేటాని landscape లోకి translate (శబ్దాన్ని landscape గా) చేసే బాధ్యత.

వేల data points. అతి కష్టమైన ప్రక్రియ. గణితం నైపుణ్యంతో బాటుగా ఒక కళాకారుడికి ఉండే ఇన్‌ట్యూషన్ కూడా ఉండాలి. లెబోరియస్ జాబ్. Data విజువలైజ్ చేయగలిగే నైపుణ్యంతో, జియోమెట్రిక్ ఇన్‌ట్యూషన్‌తో map ని తయారు చేయాలి. అప్పటికి కంప్యూటర్స్ వాడకం లేదు. టెక్టానిక్ ప్లేట్స్ థియరీ లేదు.

అయినా అద్భుతమైన నేర్పు, ఓర్పు, నైపుణ్యంతో ఆమె అట్లాంటిక్ ఫ్లోర్ ప్రొపైల్ స్కెచ్ చేసింది. అట్లాంటిక్ ఫ్లోర్ నడుమ (మిడ్ అట్లాంటిక్) ఒక రిడ్జ్ (అది ఒక ‘V’ shaped valley) మౌంటెన్ రేంజ్‌గా ఆమె గ్రహించింది. సముద్రపు floor ఒక ప్రక్కకు జరుగుతోంది. కాని ఆమె సహ శాస్త్రజ్ఞులు ఆ proposal ని ఒప్పుకోలేదు. ఆమె ప్రెజెంటేషన్ 1952లో డిస్కస్ చేయబడింది. నిజానికి 1912లో Alfred Wegener ప్రతిపాదించిన continental drift సిద్ధాంతానికి ఆమె స్కెచ్ చాలా దగ్గరగా ఉంది. అయినప్పటికీ ఆమె తన పరిశోధనల ఫలితాల ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనలకు మన్నన దక్కలేదు. పురుషాధిక్యత ఒక ప్రాంతానికో దేశానికో పరిమితం కాదనటానికి మేరీ థార్ప్ ఉందంతం ఒక చక్కని ఉదాహరణ.

అయితే ఆలస్యంగానైనా కృషికి మన్నన గుర్తింపు దక్కక తప్పదు. శాస్త్రవిజ్ఞాన ప్రపంచంలో ఇది చరిత్ర నిరూపించిన సత్యం.

హైన్రిచ్ బెరన్ ఒక ప్రఖ్యాత చిత్రకారుడు. కార్టోగ్రాఫర్. అతడు మేరీ థార్ప్ విశ్లేషించిన సంక్లిషమైన డేటాను – శబ్ద తరంగాల ఆధారంగా సముద్రపు లోతులలోనున్న అట్టడుగు తలాన్ని (ఓషన్ ఫ్లోర్) కొలిచి రూపొందించిన maps ను చిత్రాలుగా రూపొందించాడు. అతడు అద్బుతమైన లాండ్‌స్కేప్ పెయింటిగ్స్‌కు ప్రసిద్ది. ప్రతి చిత్రాన్ని/లాండ్‌స్కేప్‍ను పెద్దదిగా జూమ్ చేసి చిత్రీకరించేవారు. అవన్నీ ఉట్టి చిత్రాలుగా కాక కీలకమైన సమాచారాన్ని కూడా వెలువరించేవిగా ఉండేవి. ఆ కారణంగా ప్రజలకు, వీక్షకులకు ఆ దృశ్యాలను ఏరియల్ వ్యూలో చూసిన ఫీలింగ్ కలిగేది. వాస్తవికత అర్థం అయ్యేది.

మేరీ థార్ప్ అట్లాంటిక్ ఫ్లోర్ ప్రొఫైల్ ఆధారంగా రూపొందిచిన స్కెచ్ మేప్స్ ను అద్భుతమైన మేప్ పెయింటింగ్స్‌గా చిత్రీకరించాడు. ఈ మేప్స్ టెక్టానిక్ ప్లేట్స్‌ను గురించిన దృశ్యరూపాలను ప్రజల కళ్లకు కట్టడంలో సఫలమయ్యాయి. అతడు చక్కటి కార్టోగ్రాఫర్ కూడా కావటంతో మేరీ థార్ప్ ప్రతిపాదించిన థియరీ కూడా సాధికారికంగా ఎస్టాబ్లిష్ అయింది. ఓషనోగ్రఫీకి సంబంధించి తరువాతి కాలంలో జరిగిన అనేక పరిశోధనలకు దిక్చూచి అయింది. ఆలస్యంగానైనా మేరీ థార్ప్ చేసిన విశిష్టమైన కృషికి గుర్తింపు లభించింది.

Exit mobile version