Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గాయపు గాథ

[మనోజ్ కుమార్ నీలం రచించిన గాయపు గాథ అనే కథను అందిస్తున్నాము.]

శరీరానికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయం చాలా పెద్దది.

ఎందుకంటే గాయం వెనుక ఉన్న నొప్పి ఆ గాయం మానేంతవరకు బాధని గుర్తు చేస్తుంది.

నిజమే కదా గాయం జ్ఞాపకమే గానీ గాథ కాదు.

అలా గాయపడిన ఒక మనిషి కథ ఇది.

తెలిసి తెలియని వయస్సులో తల్లి, తండ్రి తననే కాదు లోకాన్ని కూడా విడిచిపెట్టారు.

తన జీవితాన్ని తనే అపార్థం చేసుకుంటూ వచ్చాడు, ఎక్కడ ఉంటున్నాడో, ఏమి తింటున్నాడో తనకి మాత్రమే తెలుసు.

తనవారు విడిచిపెట్టడం, ఇంటి పేరు వాళ్ళు వదిలిపెట్టడం, తనకంటూ ఉన్నది తను ఒక్కడే.

మూడు పూట్ల అన్నం కోసం, తను వెతకని రోడ్డు లేదు, ఆకలి కోసం ఆలోచిస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాడు.

ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మెకానిక్ షాప్‌లో, సాయంకాలం ఒక ‘టీ’ షాప్‌లో చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.

ఒకరోజు రోడ్డు దాటుతుండగా పెద్ద వ్యాన్ తనని గుద్దింది.

రక్తపు మడుగులో శరీరం. అంతా గాయాలతో, చుట్టూ ఉన్నవారి సహాయంతో, 20 ఏళ్ల వయసులో హాస్పటల్లో ఉన్నాడు.

తనని హాస్పిటల్లో తీసుకువచ్చిన వారందరూ నెమ్మది నెమ్మదిగా తనని విడిచి వెళ్ళిపోయారు. 19 సంవత్సరాల వయసులో తనకి కలిగిన బాధల కంటే, 20 సంవత్సరాలు తనకు కలిగిన ఈ దెబ్బ, ఈ బాధ చాలా పెద్దది.

తన మనసులో వచ్చిన ఆలోచన “నాకు ఎవరున్నారు?”.

ఆ బాధను అర్థం చేసుకున్న ఒక నర్స్ ఆ వ్యక్తిని అర్థం చేసుకుంది.

ప్రతిరోజు తనను సొంత బిడ్డ లాగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం, తనకు పెడుతూ ఆ నర్స్ డ్యూటీ టైంలో బాగా చేసుకుంటా తన డ్యూటీ అయిపోయినా ఆ వ్యక్తి కోసం ఎక్కువ సమయం తనని సొంత కొడుకు లాగా దగ్గరికి చేర్చుకుంది.

ఆ నర్స్ తనతో పాటు ఆ వ్యక్తిని తన ఇంటికి తీసుకు వెళ్ళింది.

అందుకే చెప్పాను “గాయం జ్ఞాపకమే గాని గాథ కాదు.”

తన మనసులో హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తున్న తాను అన్న మాటలు “ఇక గాయమైనా భయం లేదు, ఎందుకంటే ప్రతి గాయం నన్ను ఒక గమ్యానికి చేర్చింది.”

Exit mobile version